17, జులై 2020, శుక్రవారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః

శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
*35వ నామ మంత్రము*

*ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమ*🙏🙏🙏కనబడుచున్న నూగారు (రోమలత) అను తీగకు ఆధారంగా విరాజిల్లు సన్నని నడుము గలిగిన జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా* అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రముసు *ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః* అని ఉచ్చరించుచూ పరమేశ్వరీ పాదసేవాపరాయణులైన భక్తులకు పరమేశ్వరి అనుగ్రహంలభించి శ్రీవిద్యా తత్త్వము పూర్తిగా అవగాహన చేసుకొని ఆత్మానందానుభూతిని పొంది తరించుదురు🌻🌻🌻పందిరిమీదకు తీగ పాకాలంటే ఆలంబన (ఆధారం) అవసరము. అలాగే అమ్మవారి బొడ్డు అను పాదు నుండి నూగారు (నూగువంటి రోమాళి) అను తీగ వక్షస్థలమువైపు  ప్రాకి అచట ఆ తీగకు అమ్మవారి స్తనయుగము ఫలములైనవని ఇంతకు ముందు 611వ నామ మంత్రములో వశిన్యాదులు వర్ణించారు అని తెలుసుకున్నాము అంటే ఆ నూగారు తీగకు ఆధారము కావాలి కదా. అటువంటి ఆధారంగా అమ్మవారు సన్నని అందమైస నడుముతో విలసిల్లుచున్నదని ఈ నామ మంత్రములోని భావము🌺🌺🌺దేవియొక్క ఆవిర్భావ కాలమున ఇంద్రుని తేజముచే నడుము ఏర్పడెను. ఇది మణిపూరక స్థానము అగును. స్థూల శరీర తాదాత్మ్యము కొంతవరకు తొలగిననూ, సూక్ష్మ శరీర తాదాత్మ్యము తొలగలేదు. అందుచే ఆత్మానుభూతి అనేది లక్ష్యాలక్ష్యముగానే ఉండును. అనగా ఊహ్యముగానే ఉండును అని ధ్వని. ఈ నామములో మరొక విశేషమేమనగా *సమున్నేయ* అనగా చక్కగా ఉద్ధరింపబడినదని అర్థము. నాభికి దిగువభాగమున ఉన్న అధోలోకాలు - నాభికి పైగా ఉన్న ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిగా నడుము ఉంటుంది. అనగా అధోలోకములను, ఊర్ధ్వలోకములను ఉద్ధరించేందుకు  అనువుగా సన్నని నడుము ఏర్పడినదని మరొక అర్ధము🌸🌸🌸శ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమ*  అని అనవలెను🌹🌹🌹  🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము🚩🚩🚩🕉🕉  🌺🌻🌹🌻🌸 🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం - 7702090319
 *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*612వ నామ మంత్రము*

*ఓం ఐం హ్రీం శ్రీం కళానాథాయై నమః*🙏🙏🙏కళలన్నిటికి పరమావధియై విలసిల్లు పరాశక్తికి నమస్కారము🌹🌹🌹కళలందు జగన్మాతయే అని తెలియదగినదిగా అన్న తల్లికి నమస్కారము🌻🌻🌻శ్రీలలితా సహస్ర నామావళియందలి *కళానాథా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం కళానాథాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి వారు సాధనము చేయు విద్యలందు   (శ్రీవిద్య కూడా) ను మరియు వృత్తి వ్యాపారములందును దినదినాభివృద్ధి నొసగుచూ, అన్న వస్త్రములకు, సుఖ సంతోషములకు కొదవ లేకుండా చేయును. ఇంకను ఆ భక్తులకు ఆధ్యాత్మిక చింతన నందజేసి తరింపజేయును🌺🌺🌺సర్వకళలూ జగన్మాత స్వరూపాలే, సర్వవిద్యల పరిపూర్ణతకు కూడా అమ్మవారే అవధియై ఉండును. ముఖ్యంగా శ్రీవిద్యా స్వరూపిణి మరియు సర్వమంత్ర స్వరూపిణియై భక్తజనులకు బ్రహ్మతత్త్వమే పరమావధియై ఉంటుంది. కళానాథుడు అంటే చంద్రుడు. శ్రీచక్రమధ్యమున అయ్యవారు అమ్మవారు రెండు బిందువులై ఆ రెండు బిందువులలో అయ్యవారు సూర్యునికి సంకేతమైతే అమ్మవారు చంద్రునికి సంకేతముగాను శ్రీమాత *చంద్రస్వరూపిణ* అని కూడా ఈ నామమంత్రములోని భావము🌹🌹🌹సర్వేంద్రియములను కళలుగా భావిస్తె ఇంద్రియాలకు అధిపతి మనస్సు, ఆ మనస్సును సూచించేది చంద్రుడు కళానాథుడైతే, అమ్మవారు *చంద్రస్వరూపిణి* గనుక అమ్మవారిని *ఇంద్రియాధినాథురాలి* గా కూడా అమ్మవారని ఈ నామ మంత్రములోని భావము🌻🌻🌻అట్టి సకలకళాస్వరూపిణి, కళానాథా యని స్తుతింపబడే జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం కళానాథాయై నమః* అని అనవలెను🌸🌸🌸🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము🚩🚩🚩🕉🕉  🌺🌻🌹🌻🌸 🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319

614వ నామ మంత్రము*

*ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః*🙏🙏🙏కుడిఎడమలందు లక్ష్మీసరస్వతులు  వింజామరలతో సేవింపబడు జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళిలో  *సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా* అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను ఉపాసన చేయు ఉపాసకులకు లక్ష్మీ, సరస్వతుల వలన జ్ఞానసంపదలు, అష్టైశ్వర్యములు, శ్రీమాత కరుణచే సర్వమంగళములు ప్రాప్తించును మరియు నిరంతరం శ్రీమాత సేవనుకూడా చేయుచు తరింతురు🌻🌻🌻లక్ష్మీసరస్వతులు ఇరువురు సింహాసనారూఢురాలైన శ్రీమాతకు, వరుసగా ఎడమ, కుడివైపున నిలబడి వింజామరలు వీచుతూ ఉంటారు. ఒకరు విత్తమునకు మరియొకరు విద్యలకు అధిష్ఠాన దేవతలవడంచేత, జగన్మాత సేవాభాగ్యంచే లక్ష్మీకటాక్షము, ఆ పైన సరస్వతీ కటాక్షము కూడా అనుగ్రహింపబడడం జరుగుతుంది🌸🌸🌸శ్రీలలితా సహస్రనామార్చన చేయునపుడు ప్రతీ నామ మంత్రమునకు ముందు *ఓం ఐం హ్రీం శ్రీం* అను బీజాక్షరములను పలుకుతాము కదా. వీటిలో మఖ్యం అమ్మవారి యొక్క శక్తి బీజం *హ్రీం* నకు ఇరువైపుల సరస్వతీ బీజం *ఐం* మరియు లక్ష్మీ బీజం *శ్రీం* ఉండుట మనం గమనించవచ్చును. శ్రీమాతకు కుడివైపు సరస్వతి, ఎడమ వైపు లక్ష్మీదేవి మంత్రబీజములు ఉండును. సామాన్యముగ ఎడమవైపు ఉన్న వారికంటె కుడివైపు ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవికన్నా సరస్వతీ దేవికి ఎక్కువగా ప్రాశస్త్యము ఇవ్వబడినది. సరస్వతీ దేవి అనుగ్రహమున్న విద్యతో లక్ష్మిని అనగా ధాన్యాన్ని సంపాదించవచ్చు. కాన లక్ష్మి అంటే ధనం ఉన్నచో సరస్వతిని స్వంతము చేసికొనుట సాధ్యం కాని పని. ఒకవేళ ధనముతో విద్యను కొన్నా ప్రయోజనము సున్నా. గౌరవము లభింపదు. అందుచేత సరస్వతి దేవి *ఐం* బీజాక్షరము కుడివైపు స్థానము కలిగినది. ఎడమ ప్రక్క స్థానం లక్ష్మీదేవి అనగా ధనమునకు లభించినదని భావము🌺🌺🌺శ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం  శ్రీం సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితాయై నమః* అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: