తమిళులు మిరియాలు రోజు గారెల్లో, పొంగల్ లో వేసుకుని తింటారు.. అలానే, చపాతీ లో కూడా సాంబార్ పోసుకుని తింటారు.. సాంబార్ అంటే మొత్తం మనం అనుకునే మసాలాలు - జీలకర్ర, ధనియాలు, మిరియాలు, పసుపు అన్ని ఉంటాయి..
అయినా అక్కడ కరోనా తగ్గు ముఖం పట్టలేదు..
అల్లం లేకుండా టీ తాగడం అనేది మరాఠీలకి తెలియదు.. అక్కడ కూడా కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి..
అలానే, పుదీనా, కొత్తిమీర, చాట్ మసాలా లేకుండా గుజరాతి వారికి రోజు గడవదు.. పైపెచ్చు వీరిలో వెజిటేరియనులే ఎక్కువ, అయిన కేసులు ఎక్కువగానే ఉన్నాయి..
అలానే ముస్లింలు రోజు తినే కూరల్లో కానీ, బిర్యానిలో కానీ అల్లం, వెల్లుల్లి, పసుపు, మసాలాలు లేకుండా ఉండదు. వారిలో కూడా కరోనా బాధితులు ఎక్కువ గానే ఉన్నారు..
చిరు ధాన్యాలు జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి తినే రాయలసీమ, తెలంగాణ వాళ్ళలో కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయి..!!
నా ఆలోచన ప్రకారం ఆహారం విషయం కాకుండా మనం బయట ఎంత సేపు, ఎంత మందితో కలుస్తామో, అనవసరంగా బయట ఎంత సేపు తిరుగుతామో, దానిని బట్టి కరోనా బారిన పడే ఛాన్స్ ఉందని పిస్తుంది!! కనుక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళి, ఆరోగ్యంగా ఉండాలి.
నిజమే కదా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి