ఒక రోజు నా శ్రీమతి భోజనంలోకి వడ్డించిన ఆవకాయ తిని
"ఏంటమ్మి, ఆవకాయ ఇట్లాఉంది! నువ్వు పెట్టిందేనా!" అని అడిగా..
"అడుక్కొచ్చిన ఆవకాయ ఇంకెలా ఉంటుంది" అంది.
"అడుక్కు రావటమేంటి" అన్నా..
"ఎప్పుడో మే లో పెట్టింది సెప్టెంబర్ దాకా ఉంటుందా... జాడీలో అడుక్కు రాకుండా" అంది.❤️
వింజమూరి వెంకట అప్పారావుగారి పోస్టు.
**********
జనాభా లెక్కల సేకరణ కు "తలతిక్క నిలయం" అనే ఇంటికెళ్ళాడో జనాభా లెక్కల సేకరణ అధికారి.
అధికారి: ఏవండీ,ఇంట్లో ఎవరూ లేరా?
ఇంట్లోంచి : ఉన్నారు
అధికారి : మరి బయటికి రారేం?
ఇంట్లోంచి : నువ్వడిగావా?
అధికారి : ఓహ్, సారీ..నేను జనాభా లెక్కల సేకరణ అధికారిని, నాకు మీ ఇంట్లో ఉంటున్న వారి సమాచారం కావాలి.
ఇంట్లోంచి ఓ ముసలావిడ బయటకు వచ్చింది.
ఏం కావాలి నాయనా? అంది,
వచ్చిన అధికారి బామ్మను చూసి బుర్ర గోక్కుంటూ విషయం చెప్పాడు.
అధికారి : బామ్మగారూ, ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు?
బామ్మ : డజన్
అదికారి : డజనా? ఓహ్, పన్నెండు మందా. సరే, పెద్దాయన ఏంజేస్తుంటారు?
బామ్మ : జైలు కెళ్ళాడు.
అధికారి : అదిరిపడి, జైలు కెళ్ళాడా? ఏం నేరం చేసాడు?
బామ్మ : నీ మెుహం మండా, వాడు జైలరు.
అధికారి : ఓహ్ ! అలానా, ఆయనకు ఎంతమంది పిల్లలు?
బామ్మ : ఓక పోతు, రెండు పెంటి
అధికారి : పోతు,పెంటి ఏంటండీ?
బామ్మ : వెధవా, అదికూడా తెలవకుండా ఎలా ఆఫీసర్ అయ్యావురా? తింగరి వెధవ,
ఓక మగ, ఇద్దరు ఆడ
అధికారి : బామ్మగారు, మీరు మరీ మర్యాద లేకుండా మట్లాడుతున్నారు, ఇప్పుడు చెప్పండి, వారి అబ్బాయి ఏం జేస్తుంటాడు?
బామ్మ : ఆ... కొంపలార్పుతుంటాడు
అదికారి : ఛ ఛ.. అదేం పనండీ? మీరైనా చెప్పలేక పోయారా?
బామ్మ : వాడు ఫైర్ డిపార్ట్ మెంట్ రా అరకాణీ వెధవా !
అదికారి : బామ్మ గారు, మీరు సరిగ్గా చెప్పండి, ఇలా డొంకతిరుగుడు నాకర్థం కాదండీ, మీరు మరీ తిట్టేస్తున్నారు, :( ఏడ్పు మెుహం పెట్టి..
బామ్మ : ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువురా? పింజారీ వెధవ.
అదికారి : బామ్మ గారు, ఇక చాలు, మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి, దయచేసి..
బామ్మ : ఓకత్తేమో ఊడపెరుకుతుంటుంది, ఇంకొకత్తేమో తైతక్కలాడుతుంటాది.
అదికారి : జుట్టు పెరుక్కుంటూ, బామ్మగారూ... ఊడబెరకడం, తైతక్కలాడడం ఏందండీ?
బామ్మ : ఓకతి పళ్ళ డాక్టర్, ఇంకోతి భరతనాట్యం అధ్యాపకురాలురా నెలతక్కువ వెధవా!
అధికారి అప్పటికే స్పృహ లో లేడు......
***********
అమ్మ :: ఒరేయ్ !! పొయ్యి పొయ్యి తమిళ్ అమ్మాయిని లవ్ చేసావు .
ఆ అమ్మాయిని నీకిచ్చి పెండ్లి చెయ్యాలంటే ఒక షరత్తు పెడతా
నెల రోజుల్లో తెలుగు నేర్పించు
అప్పుడే నీ పెళ్లి ఖాయం చేస్తా ,సరేనా
కొడుకు :: అలాగే అమ్మా కోమలి కి నెలరోజుల్లో తెలుగు నేర్పి నీతో మాట్లాడిస్తా ,సరేనా
********నెల తర్వాత ********
అమ్మ :: ఏరా !! మాటనిలబెట్టుకుంటావా ?
కొడుకు :: అమ్మా నీ చుమ్మా యిరి
నీ ఎన్నమ్మా తెలుంగు తెలుంగు అంపిచ్చి వేలాపందిట్ఠా
బాషా లో యెన్నా యిరుక్కి
మన్నిక్కునం
అమ్మ :: ఓర్నాయనోయ్ కొంపముంచావు కదురా.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి