ఆషాఢ (గురు) పూర్ణిమ లో వైఙ్ఞానిక విశేషం మీకు తెలుసా, ఇప్పుడు వైఙ్ఞానికులు కూడా ఆషాఢ పూర్ణిమ విశేషతను అర్ధం చేసుకొన్నారు. "విస్డమ్ ఆఫ్ ఈస్ట్" అనే పుస్తకంలో రచయిత ఆర్ధర్ చార్ల్స్ స్టోక్ ఇలా వ్రాసారు- ఏ విధంగా భారతదేశం ద్వారా వెలుగులోకి వచ్చిన శూన్యం (సున్నా), ఛందస్సు, వ్యాకరణం మొదలైనవాటి ఖ్యాతిని విశ్వమంతా గుర్తించి కీర్తిస్తున్నారో అదేవిధంగా భారతదేశం ద్వారా కీర్తించబడే సద్గురువు మహిమ కూడా విశ్వమంతటా గుర్తించే సమయం త్వరలో వస్తుంది. ఆషాఢ పూర్ణిమనే గురుపూర్ణిమగా ఎందుకు ఎన్నుకొన్నారో అది కూడా తెలిసివస్తుంది. స్టోక్ ఆషాఢ పూర్ణిమ విషయమై ఎన్నో రకాల అధ్యయనాలు మరియు పరిశొధనలు చేసారు. ఈ పరిశోధనల ఆధారంగా ఇలా చెబుతున్నారు - సంవత్సరంలో శరత్ పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఇత్యాది అనేక పూర్ణిమలు వస్తాయి. కానీ ఆషాఢ పూర్ణిమ ఙ్ఞాన మార్గంలో నడిచే సాధకులకై విశేషమైనది. ఈ రోజు ఆకాశంలో ఆల్ట్రా వయిలట్ రేడియేషన్ వ్యాపించి ఉంటుంది. దీని కారణం వలన మానవుని శరీరం మరియు మనస్సు ఒక విశేష స్థితిలో నెలకొని ఉంటాయి. అతని ఆకలి, నిద్ర, మనస్సుల చంచలత తక్కువగా ఉంటుంది. అందువలన ఈ స్థితి సాధకునికై అత్యంత లాభదాయకమైనది. ఆ సాధకుడు దీనిని ఉపయోగించి ఎక్కువలో ఎక్కువ సాధన చేసి అధిక ఫలితం పొందగలుగుతాడు. అందువలన ఆషాఢ పూర్ణిమ ఆత్మోద్ధరణకై ఉత్తమమైనదిగా వైఙ్ఞానిక పరంగా చెప్పటం జరిగింది.
గురు బంధువులందరికీ గురు పూర్ణిమా మహోత్సవ ముందస్తు శుభాకాంక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి