సమయం గడిచిపోయింది,
ఎలా గడిచిందో తెలియదు,
జీవితమనే..పెనుగులాటలో..... వయసు గడిచిపోయింది తెలియకుండానే....
✍భుజాలపైకి ఎక్కే పిల్లలు భుజాలదాక వచ్చేశారు.
తెలియనేలేదు..
✍అద్దె ఇంటి నుండి చిన్న గా మొదలైన జీవితం. ఎప్పుడు మన ఇంట్లో కి వచ్చామో,
తెలియనే లేదు.......
✍ఆయాసంతో సైకిల్ పెడల్ కొడుతూ..కొడుతూ..
కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో,
తెలియనే లేదు......
✍ఒకప్పుడు తల్లిదండ్రుల బాధ్యత మాది. కానీ
ఇప్పుడు నా పిల్లలకు నేను బాధ్యత గా మారాను
ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు.....
✍ఒకప్పుడు పగలు కూడా హాయిగా నిద్ర పోయే వారం..
కానీ ఇప్పుడు నిద్ర రాని రాత్రులు ఎన్నో ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు....
✍ఒకప్పుడు నల్లని కురులనుచూసుకొని గర్వంగా వగలు పోయే వాళ్ళం..
అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో,
తెలియనే లేదు...
✍ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ..ఉద్యోగం పొందాక ఎప్పుడు రిటైర్ అయ్యామో..
తెలియనేలేదు....
✍పిల్లల కోసం ప్రతిదీ అని ఎంత తాపత్రయం పడ్డామో..
వాళ్ళు ఎప్పుడు దూరంగా వెళ్లి పోయారో,
తెలియనే లేదు.....
✍రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల మధ్య గర్వంగా నడిచే వాడిని ఎప్పుడు అందరూ...దూరమయ్యారో తెలియనే లేదు....
✍ఇప్పుడు ఆలోచిస్తున్నాను..
నా కోసం..నా శరీరం కోసం ఏమైనా చేసుకోవాలని..
కానీ..
శరీరం సహకరించడం లేదు.
✍ఇవన్నీ..జరిపోయాయి..
కానీ కాలం ఎలా గడిచిందో....
తెలియనేలేదు..... తెలియనేలేదు....
🦜It's truth of life.🦜
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి