23, నవంబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత

-

యౌవనాశ్వుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. నూరుమందిని వివాహమాడాడు.

అయివా ఒక్క కడుపు పండలేదు. రోజూ అతడిని ఇదే దిగులు కుంగదీసింది. అరణ్యాలకు వెళ్ళి

ఋషులను ఆశ్రయించాడు. నిట్టూ స్పలు విడుస్తూ విలపించాడు. ఋషులు ఓదార్చి శోకకారణం అడిగి

తెలుసుకున్నారు. మాకు చేతనైతే ఉపకారం చేస్తాం, చెప్పు అన్నారు.

మహర్షులారా! నాకు రాజ్యం ఉంది. సంపద ఉంది. గుర్రాలు ఉన్నాయి. నూర్గురు

భార్యలున్నారు. నాకంటే బలశాలి లేడు. శత్రువులు లేరు. మంత్రిసామంతులంతా విధేయులే. అన్నీ

బాగానే ఉన్నాయి. కానీ ఒకే ఒక్కలోటు. మాకు సంతానం లేదు. ఒక్క బిడ్డడైనా లేడు. అపుత్రుడికి

ఉత్తమగతులు లేవంటారు. స్వర్గం అసలే లేదంటారు. అందుకని దుఃఖిస్తున్నాను. సంతానం కావాలి.


అపుత్రస్య గతిరాస్తి స్వర్గం నైవ చ నైవ చ |

తస్మాత్ శోచామి విప్రేంద్రాః సంతానార్థం భృశం తతః

(9-52)

మీరందరూ వేదశాస్త్ర తత్త్వజ్ఞులు. మహాతపస్వులు. సంతానార్ధనైన నాకు ఏదైనా ఇష్ట

(యజ్ఞం) చెప్పండి. నాతో చేయించండి. మీరు దయాస్వభావులు. కనక అభ్యర్థిస్తున్నాను అవి

వేడుకున్నాడు యౌవనాశ్వుడు.

దీనికి ఇంత దుఃఖపడవలసింది ఏముంది ? అలాగే చేయిస్తామంటూ ఇంద్రదేవతాకమైన

ఇష్టిని చేయించారు. జలపూర్ణకలశాన్ని వేదోక్తులతో అభిమంత్రించారు. మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని

రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పించారు. కానీ ఆ రోజు అర్ధరాత్రి యౌవనాశ్వుడు దప్పిక తట్టుకోలేక

యాగశాలలో ప్రవేశించి, నిద్రపోతున్న విప్రులను లేపడమెందుకులే అని ఆ కలశంలో నిండా ఉన్న

ఉదకాన్ని తెలియక తాను పుచ్చేసుకున్నాడు. వెళ్ళి తన గుడారంలో పడుకొన్నాడు.

తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసి విప్రులు ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు

త్రాగేరని రాజును ప్రశ్నించారు. నేనే త్రాగేనని యౌవనాశ్వుడు చెబితే దైవయోగం ఇలా ఉంది కాబోలువని

విప్రులు సరిపుచ్చుకుని ఇష్టిని సమాప్తం చేశారు. ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్ళిపోయారు.

మంత్రోదకం కారణంగా రాజుగారు గర్భం ధరించాడు. నెలలు నిండాయి. పొట్ట కుడివైపు

చీల్చుకుని మగబిడ్డ జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు

కామెంట్‌లు లేవు: