5, మే 2023, శుక్రవారం

అల్లం గురించి

 అల్లం గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .


      సంస్కృతంలో అల్లమును "విశ్వాఔషధ" అని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది . జీర్ణకరము , విరేచనకారి , కళ్లు , గొంతుకు మంచిది . దీని విరేచనగుణం వలన పేగులలో పురుగులను నాశనం చేస్తుంది . అలా నాశనం అయిన క్రిములు మూత్రము ద్వారా బయటకి విసర్జించబడతాయి. పేగులకు అల్లం మంచి టానిక్ లాగా పనిచేస్తుంది . దీనిని వాడటం వలన ఇటువంటి సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.


         అల్లము నందు విటమిన్ A , మరియు విటమిన్ C , ఫాస్ఫరస్ కొంత మోతాదులో ఉంటుంది. భోజనం తీసుకోవడానికి గంట ముందు చాలా చిన్నమొత్తంలో మినరల్ సాల్ట్ , నిమ్మకాయ రసం కొన్ని చుక్కలు , నాలుగు స్పూనుల అల్లం రసం కలిపి లోపలికి తీసుకుంటే ఆకలిని అద్భుతముగా పెంచును. గ్యాస్ సమస్య కూడా పరిష్కారం అగును. దగ్గు , జలుబు , రొంప మొదలయిన సమస్యలతో బాధపడేవారు అల్లం వాడటం వలన సమస్య నుంచి తొందరగా బయటపడతారు. గుండెజబ్బు ఉన్నవారు తరచుగా అల్లం వాడటం చాలా మంచిది . అన్ని రకాల ఉదరవ్యాధులకు అల్లం చాలా మంచి పరిష్కారం చూపిస్తుంది.


           అల్లం రసం ప్రతినిత్యం తీసుకోవడం వలన మూత్రసంబంధ సమస్యలు , కామెర్లు , మూలశంఖ , ఆస్తమా , దగ్గు , నీరుపట్టడం వంటి సమస్యలు త్వరగా నయం అగును. ఔషధాలు సేవిస్తూ అల్లంకూడా వాడటం వలన త్వరగా ప్రయోజనం చేకూరును . ఆయుర్వేదం ప్రకారం అల్లాన్ని ప్రతినిత్యం తీసుకోవడం వలన గొంతు , నాలుక సంబంధ సమస్యలకు అద్భుతముగా పనిచేయును . తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లంరసం ముక్కులో వేయుచున్న తలనొప్పి తగ్గును. పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు పంటిపైన అల్లం ముక్కతో రుద్దిన నొప్పి తగ్గును. సైనసైటిస్ నుంచి కూడా విముక్తి లభించును.


  మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .  


   

కామెంట్‌లు లేవు: