*श्लोकम्* :
*यथा मृत्पिण्डतः कर्ता कुरुते यद्यत् इच्छति ।*
*एवमात्मकृतं कर्म मानवः प्रतिपद्यते ।।*
*శ్లోకం:*
*యథా మృత్పిణ్డతః కర్తా కురుతే యద్యదిచ్ఛతి ।*
*ఏవమాత్మకృతం కర్మ మానవః ప్రతిపద్యతే ।।*
*Meaning:*
Man, always proposes and does whatever he likes according to his thought process and ideas just as a pot maker creates various objects from the raw earthen material. Meaning, everybody acts as per his own nature & character and based on the influences of the environment in which he was raised.
*తాత్పర్యం:*
ఈ సుభాషితము *నారాయణ పణ్డితుడు రచించిన హితోపదేశము లోని మిత్రలాభ విభాగము లోనిది*.
ఏ విధముగానైతే మట్టి ముద్ద నుండి కుమ్మరివాడు, తన ఆలోచనలకి అనుగుణంగా కోరిన వస్తువును తయారు చేయ గలుగుచున్నాడో, అదేవిధంగా మానవుడు తన మనస్సుకి నచ్చిన విధముగా, తన ఆలోచనలకి అనుగుణం గా ప్రయత్నానురూపంగా కర్మలని ఆచరిస్తాడు మరియు ఫలితం పొందును.
ఆ కర్మలు మంచివైతే మంచి ఫలితాలని, చెడ్డవైతే చెడ్డ ఫలితాలని మనిషి అనుభవిస్తాడు
ఏ విధమైన కర్మలని ఆచరించాలో, ఏ విధమైన కర్మలని ఆచరించితే ఉత్తమ స్థాయిలకి ఎదగడానికి అవకాశం ఉన్నదో అనే విషయం పిన్న వయస్సులో పిల్లలకి ఎక్కువగా అవగాహన ఉండదు, కావున, వారు మంచి పనులని చేసే విధముగా, వారు సన్మార్గములో నడిచే విధంగా ఆ బాధ్యత కనిపెంచే తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులపైన వారి పిల్లల పట్ల ఉన్న బాధ్యతని సుభాషిత కారుడు పరోక్షంగా గుర్తు చేస్తున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి