ఇది ఎవ్వరిని విమర్శించటానికి, లేక ఎవ్వరి మనస్సు నొప్పించటానికి కాదు. కేవలం ఇప్పటి మన హైందవ ధర్మం యెక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్రాసింది.
ఇప్పుడు మన హిందూ ధర్మానికి మూడు విధాల గ్లానులు కలుగుతున్నాయి.
1) ఇతర మతస్తులు మన హిందువులపై మాయ మాటలు చెప్పి వారి మతంలోకి మార్చుకోటం అంటే మతమార్పిడి.
2) నాస్తిక వాదం
3) సాయి బాబా వాదం.
ఇప్పుడు ప్రతిది క్షుణ్ణంగా పరిశీలిద్దాం.
1) మతమార్పిడి.: మన దేశంలో ముఖ్యంగా క్రైస్తవులు మన హిందువులలో మన ధర్మం మీద అవగాహన లేని గ్రామీణ ప్రజలని మభ్య పెట్టి కొంత ధనం, ద్రవ్యాలు ఇచ్చి మతమార్పిడి చేస్తున్నారు. మన ధర్మంలో కూడా కొంతమంది హిందూ ధర్మ ప్రచారకులు వాటిని ఆపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు వారి ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. కానీ ఇంకా ఇంకా మన ధర్మం మీద ప్రతివారికి అవగాహన రావాలి అందరు ఒక ఉద్యమంగా మారి ఈ మాత మార్పిడులను అరికట్టాల్సిన అవసరం వుంది.
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మేము ప్రార్ధన చేసి మీ రోగం తగ్గిస్తామని వారికి నమ్మబలికి కొన్నాళ్లకు వారిని తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని మనమందరం అరికట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది.
2) నాస్తిక వాదులు; మన హిందుత్వంలోనే జన్మించిన కొందరు హిందూ ధర్మం మీద అవగాహన లేక కొంతమంది చెప్పే వాటిని నమ్మి దేముడు లేడు అని ప్రచారం చేస్తున్నారు. వారికి మన హిందూ ధర్మం మీద మన పురాతన జ్జ్ఞానంమీద అవగాహన కల్పిస్తే తప్పక వీరు హిందుత్వపు గొప్పతనం తెలుసుకోగలుగుతారు.
3) సాయి బాబా వాదం ఇది ముఖ్యంగా మన బ్రహ్మళ్లలో వుంది. సాయి బాబా దేముడని సాక్షాత్తు దత్తాత్రయ అవతారం అని ప్రచారం చేస్తున్నారు. మన ధర్మం ఎవరిని నీచంగా చూడామని, విమర్శించమని చెప్పదు. కానీ మన ఉనికికి ప్రమాదం ఏర్పడే టప్పుడు మనం మన జాగ్రత్తలో ఉండాలి మన వారికి సరైన మార్గంలో ఉంచాలిసిన అవసరం వుంది.
సాయి బాబా ఒక మంచి ఫకీర్ ఐ ఉండవచ్చు, కానీ అతను మొదటగా హిందువు కాదు, రెండు ఆయన ఒక పాడుబడ్డ మసీదులో నివాసం ఉన్నట్లు చెపుతున్నారు, మూడు తను ఎప్పుడు తన మత దేముడి స్మరణే చేసినట్లు చెపుతున్నారు. మరి ఆయన మన హిందూ దేముడు యెట్లా అవుతారు. ఆలోచించండి. జ్ఞానులు ఇతర మతాలలో కూడా వుంటారు. వారిని మనం జ్ఞానులుగానే పరిగణించాలి కానీ దేముడి హోదా ఇవ్వకూడదు కదా.
తన తప్పశెక్తితో కొన్ని మహిమలు చూపి ఉండొచ్చు మనం కాదనం. కానీ ఇటీవల కాలంలో వున్న మహానుభావులు, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షిలను కూడా మనం యోగులుగా చూస్తున్నాం కానీ ఎవరికి దేముడి హోదా ఇవ్వలేదు కదా. అంతేకాదు ఆది శంకరాచార్య, రామానుజచార్య, మద్వాచార్య లను మనం హిందూ ధర్మమును కాపాడటానికి వచ్చిన మహానుభావులుగా చూస్తున్నాము కానీ ఎవ్వరికీ మనం దేముడి హోదా ఇవ్వలేదు గమనించగలరు. ఇంకా వెనకకి వెళ్ళితే, ఎందరో మహర్షులు, బ్రహ్మర్షులు, మన భారత గడ్డమీద జన్మించారు అది మనకు వారి జ్ఞాన సంపద వల్ల తెలుస్తున్నది. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ఎందరో ఋషులు వరాలు, శాపాలు ఇచ్చారని మనకు పురాణాలవల్ల తెలుస్తున్నది. మరి మనం ఎవ్వరికీ దేముడి హోదా ఇవ్వలేదు. కాబట్టి మేధావులు ముఖ్యంగా సాయి బాబాను ఆరాధించే వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను.
ధర్మాన్ని రక్షించండి అది మిమ్ములను మీ కుటుంబాన్ని రక్షిస్తుంది.
సార్వే జానా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి