తన పుత్రుడు అకాలమరణం పాలైనా దేశ స్వతంత్రమే ముఖ్యమని రెండో రోజే ప్రజల లోకి వెళ్లిన త్యాగి ఎవ్వరు?
పదవుల కంటే దేశ హితమే నాకు ముఖ్యమన్న మాతృ దేశా ప్రేమికుండెవ్వరు?
ఉప్పు మీద పన్ను తీసివేయనంత వరకు ఆ రుచిని ముట్టని ప్రతిజ్ఞా తత్పరుండెవ్వరు?
తన ఇంటినే ఆంధ్ర రాష్ట్ర సాధనకు వేదికజేసిన దాన కర్ణుడెవ్వడు?
తనకున్న 223 యెకరాల మాగాణీ అంతా ప్రజలకు ఇచ్చిన దాన ధర్మపరుడెవ్వరు?
తనకున్నదంతా ధారవోసి చివరకు బిక్షమెత్తిన ఆ ఆదిమూర్తి సాంబడెవ్వరు?
నమ్మినవారు నెహ్రూకి భయపడి నట్టేట ముంచినా దేశహితమే చాలు అని సంతసించినదెవ్వరు?
మహర్షియని ఒకనాడు వేనోళ్ల బొగడబడి చివరకు బిక్షగాళ్ల పంచన చేరి బిక్షమెత్తి మరణించినదెవ్వరు?
స్వతంత్ర సమరమున పాల్గొనిన ఆధారమ్మేది యన్న నీచ కాంగ్రెస్స్ నాయకుల జూచి చిరు నగవున వెడలిపోయినదెవ్వరు?
కారుల తిరిగిన వాడు కట్టి బట్టి చూపులేక గుడి మెట్ల మీద ప్రసాదాలతో కుమార్తెతో కలసి పేదరికమ్ము అనుభవించినదెవ్వరు?
అట్టి మహనీయులు ప్రజలకు మహనీయులు కారు.
వారిని తలుపలేని స్వార్థమతుల జూచిన ఏహ్యమ్ము కలుగు నాకు.
*'మహర్షి' బులుసు సాంబమూర్తి గారు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి