🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 48*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
యుక్తవయసులో నరేంద్రుడు భగవంతునికి రూపం లేదు, విగ్రహారాధన తప్పు అని
భావించసాగాడు.తాను నిజమని నమ్మే దానిని ఎవరితోనైనా సంకోచించక చెప్పడం నరేంద్రుని నైజం. ఒక రోజు శ్రీరామకృష్ణుల సమక్షంలోనే గిరీశ్ ప్రభృతులతో అతడు ఈ విషయం గురించి వాదన చేశాడు.
నరేంద్రుడు: భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఋజువు లేకుండా ఎలా విశ్వసించగలను?
గిరీశ్: విశ్వాసం అన్నదే దానికి ఋజువు.
భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయనను విశ్వసించవు. 'నేనే భగవంతుణ్ణి. మానవరూపంలో వచ్చాను' అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు.
నరేంద్రుడు : మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట, 'బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది' అని ఉంది. అందులోనే మళ్లీ మరొక చోట, 'పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు' అని ఉంది. మనుస్మృతిలో మనుపు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యూక్లో తన మరణం గురించే వర్ణిం చాడు.
సాంఖ్యశాస్త్రం ప్రకారం 'ఈశ్వరా సిద్ధేః' - అంటే 'భగవంతుడు ఉన్నాడు' అనే దానికి ఋజువు లేదు. మళ్లీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి. వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది.
కాని ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరిం చాలి? శ్వేతవర్ణ కాంతి ఎర్రటి యానకం ద్వారా వస్తే ఎర్రగానూ, పచ్చని యానకం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది.
శ్రీరామకృష్ణులు : గీత సకలశాస్త్రాల సారం. సన్న్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది.
ఒక భక్తుడు : శ్రీకృష్ణుడే (భగవంతుడే) గీతోపదేశం చేశాడు.
నరేంద్రుడు : శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరయినా చేశారో? నరేంద్రుని పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరబోయారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి