26, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఐశ్వర్యములను ఇచ్చేవాడు

 *అనుష్టుప్*

శుభైశ్వర్య ప్రదాతారం

దుస్సంకట వినాశకం

సర్వాభీష్టకరం వందే

శ్రీ అభీష్ట గణాధిపం.

*భావం*:-- శుభకరమైన ఐశ్వర్యములను ఇచ్చేవాడు, బలమైన కష్టము లను తొలగించేవాడు, అన్ని కోరికలనూ తీర్చేవాడు అయిన శ్రీ అభీష్ట గణపతి కి నమస్కారములు.

*సూచన*:-- ఈ జగత్తు లో శుభాశుభములు అన్నియునూ ఈశ్వరుడే ఇచ్చును,అంటే అన్నియునూ ఐశ్వర్యములే, అందులో శుభైశ్వర్యకరునికి ఈ సందర్భంగా నమస్కారములు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: