5, అక్టోబర్ 2023, గురువారం

*Bank Training

 *Bank Training Centre*


ప్రపంచపు మొదటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి విద్యార్థులకు క్లాసు పూర్తి చేసిన తర్వాత ఒకసారి శర్మగారు బ్యాంకింగ్ సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే అడగమని చెప్పారు.

ఒక విద్యార్థి లేచి ప్రపంచంలో పురాతనమైన బ్యాంకింగ్ వ్యవస్థ బ్రిటిష్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏనా అని అడుగుతాడు.


దానికి చిరునవ్వుతో శర్మగారు ఇలా సమాధానం చెప్పారు.


ప్రపంచపు తొలి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశం లోనే ఉంది.


*ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి నగరమే దానికి మూలస్థానం*


The First Banking Transaction :

కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ గా చెప్పుకోవచ్చు.


The First Banker:

శ్రీనివాసడికి అప్పిచ్చిన కుబేరుడిని మించిన బ్యాంకర్ ఎవరున్నారు.


The First Promissory Note :

కుబేరుడికి శ్రీనివాసుడు రాసిన ప్రామిసరీ నోట్ ప్రపంచంలోని


The First Bill of Exchange:

మొట్టమొదటి బిల్ ఆఫ్ ఎక్సేంజ్ అని చెప్పుకోవచ్చు.


The Good loan repayment

శ్రీనివాసునికి ఉన్న వడ్డీ కాసులవాడు అనే పేరు అప్పటికే ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థని ఋజువు చేస్తుంది.


తను సంపాదించి క్రమం తప్పకుండా *లోన్ రిపేమెంట్* చేస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్న వారందరికీ ఆదర్శవంతుడు.


ఇలా ఈనాడు మనం చెప్పుకుంటున్న చెలామణి లో ఉన్న ఎన్నో పథకాలు ఆ కాలంలోనే అమలు జరిగాయి.


The First lease Agreement:

వరాహ స్వామి దగ్గర స్థలం లీజుకి తీసుకుని


The First Mortgage:

ఆ లీజ్ హోల్డ్ రైట్స్ మీద శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.


The First Income source certificate:

తనకి రాబోయే ఆదాయం హామీగా చూపించాడు. అంటే అసైన్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట.


కుబేరుడిని మించిన బ్యాంకరు, శ్రీనివాసుని మించిన హై క్రెడిట్ రేటింగ్ బారోయరు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు?


ఇలా బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియజేసే తిరుపతిని ప్రతి బ్యాంకు ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాలి అని శర్మ గారు తన సమాధానం పూర్తి చేయగానే విద్యార్థులందరూ ఆశ్చర్యంగా, వేద కాలం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ - ఈనాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటే కదా అని గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేశారు.


గోవింద నామస్మరణతో క్లాస్ అంతా ప్రతిధ్వనించింది.

🙏🙏🙏

ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏

✍...

కామెంట్‌లు లేవు: