5, అక్టోబర్ 2023, గురువారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 55*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 55*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


అమ్మమ్మ వాళ్ళఇంట్లో నరేంద్రుని చదుకొనే గదికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు వెళ్లీనప్పుడు ఆధ్యాత్మిక సాధనల గురించి అనేక విషయాలను  ఉపదేశించేవారు. తల్లితండ్రుల నిర్బంధం కారణంగా వివాహబంధంలో చిక్కుకోవద్దని అతడ్డి హెచ్చరించేవారు; బ్రహ్మచర్య మహత్వాన్ని తెలియజెప్పేవారు. "పన్నెండు సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా బ్రహ్మచర్యం పాటిస్తే మేధానాడి జనిస్తుంది. అందువలన సూక్ష్మమయిన, అతి  సూక్ష్మమైన విషయాలలో చొచ్చుకొనిపోయి వాటినన్నిటినీ  కూలంకషంగా అవగతం చేసుకోగలుగుతాడు. 

 

ఈ మేధాశక్తి సహాయంతోనే భగవదనుభూతి పొందడం సాధ్యమవుతుంది. ఇటువంటి పావనమైన బుద్ధిగల వ్యక్తికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు"  అంటూ వివరించేవారు..


శ్రీరామకృష్ణులు సాన్నిహిత్యం వలననే నరేంద్రుడు వివాహానికి విముఖంగా ఉన్నాడని అతడి ఇంట్లోనివారు భావించారు. ఈ విషయంగా నరేంద్రుడు ఇలా చెప్పాడు: "ఒక రోజు అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నేను చదువుకొనే గది లోకి వచ్చి బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నారు. రహస్యంగా మా అమ్మమ్మ ఆ మాటలు విని, నా తల్లితండ్రులతో చెప్పేసింది. ఒక సన్న్యాసితో మెలగుతున్న నేను కూడా సన్న్యాసం పుచ్చుకొంటానేమోనని భయపడి ఆ రోజు నుండి వివాహపు ఏర్పాట్లు తీవ్రతరం చేశారు మా వాళ్ళు. కానీ ఏం ప్రయోజనం?


 శ్రీరామకృష్ణుల దివ్యసంకల్పం ముందు వారి ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి. కొన్ని సంబంధాలు ఖాయమై, ఇక వివాహమే తరువాయి అనే స్థితికి కూడా వచ్చాయి. కాని ఏదో చిన్న విషయంలో రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయం తలెత్తి వివాహం ఆగిపోయేది."


నరేంద్రుడు తరచు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేక పోయినా, అతడితో ఆ విషయం ప్రస్తావించడానికి ఎవరికీ ధైర్యం లేదు.  "ఇది చెయ్యి, అది చెయ్యవద్దు" అంటూ నియమాలు విధిస్తే పర్యవసానం విపరీతంగా ఉంటుందని ఇంట్లో వారికి తెలియకపోలేదు. కనుక నరేంద్రుడు శ్రీరామకృష్ణుల4 వద్దకు నిరాటంకంగా వెళ్లగలిగాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: