*05-10-2023*
*గురు వారం*
*బృహష్పతి వాసరః*
*రాశి ఫలితాలు*
*మేషం*
ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది.
*వృషభం*
ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది.
*మిధునం*
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
*కర్కాటకం*
స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.
*సింహం*
ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి.
*కన్య*
బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
*తుల*
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.
*వృశ్చికం*
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
*ధనస్సు*
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.
*మకరం*
నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
*కుంభం*
ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
*మీనం*
గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది.
🕉️ 🚩📱🇮🇳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి