19, జూన్ 2021, శనివారం

పద్య కవిత్వోత్సవం

 మె.ర.సం. పద్య కవిత్వోత్సవం--2.

~~~~~~

కవి పేరు-భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.

తేది-18-06-2021.

ప్రాంతం-కుషాయిగూడ,హైదరాబాద్.

శీర్షిక-దైవభక్తి.

చరవాణి సంఖ్య-944౦౦44142.

హామీ-ఈ పద్యాలు నా స్వీయరచన.

~~~~~~~

ఆ.వె:-

*******

కోట్ల జీవులందు గొప్ప మనుజ జన్మ

మట్టి జన్మనందినట్టి మనము

జన్మనిడిన దైవ సంసేవనమ్మును

చేసినపుడు చాల క్షేమమబ్బు.--1.

~~~~~~~~

ఆ.వె:-

******

సౌఖ్యమందజేయు సంపద లిచ్చిన,

వినయమందజేయు విద్యనిడిన

దైవ పూజలనిన తగు నమ్మకములేని

వాని జీవితమ్ము వ్యర్థమగును.--2.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿


మె.ర.సం పద్యోత్సవం--2.

 కవి పేరు-చన్ద్రశేఖర శర్మ.

తేది-17-6-2021.

అంశం-తొలకరి.

చరవాణి సంఖ్య-944౦౦44142.

హామీ-ఈ పద్యాలు నా సొంతరచన.

~~~~~~~~~

కందం:-

*******

తొలకరి చినుకులు కరిసెను

సలసల కాగిన ధరణియె చలువకు వచ్చెన్

మెలుకువ జేసెను మృగశిర

బిలబిల రైతులు తరలిరి బీళ్ళను దున్నన్.--1.

~~~~~~~~

తే.గీ:-

*******

తొలకరి చినుకులను జూచి తోషమంది

రైతులందరు చల్లిరి రత్నములను-

పోలి యుండెడి విత్తనాల్ పుడమి యందు

పసిడి పంటలన్ భూమాత! వారికిడుత!.--2.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿


పద్యకవిత్వోత్సవం.2.


కవిపేరు:భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.

తేది:16--06--2021.

ప్రాంతం:కుషాయిగూడ, హైదరాబాద్.

అంశం:ఆయుర్వేదం.

చరవాణి సంఖ్య:944౦౦44142.

హామీ:ఈ పద్యాలు నా స్వీయరచన.

~~~~~~~~

కందం:-

********

ఆయుర్వేదపు మందులు

ఆయుషమునధికముగ జేయునద్భుత రీతిన్

ప్రాయము మీరిననైనను

సాయ పడును మూలికలవి జనులకు వరమై---1.

ఆ.వె:-

*******

వంట యింటిలోన వాడు వెచ్చాలన్ని

ఔషధీయ గుణములంద జేయు

చిన్న చిన్నవైన చిట్కాలవి ఘనము

వైద్యునడిగి మనము వాడవలెను.---

2.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿





కామెంట్‌లు లేవు: