" విశ్వ జీవ ప్రశాంత జీవన దివ్య పథంలో విశ్వ మానవాళి పాత్ర "
తరతరాల పవిత్ర ఆధ్యాత్మిక సనాతన ధార్మిక జీవన గమనం !
అపౌరుషేయమై వెలువడిన పవిత్ర వేదనాదం, తరతరాల సుసాంప్రదాయ ధార్మిక సంస్కృతి !
విశ్వ కాల చక్ర భ్రమణంలో నేటికీ విశ్వ సురక్షా కవచమై వెన్నంటి నిలిచిన దార్శనికత !
" బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే సుసాంప్రదాయ, విశ్వ సుసంక్షేమ దివ్య జీవన పథం !
" కలసి ఉంటే కలదు సుఖం ", అనెడి మహోన్నత సుహృద్భావ దృక్పథ నేపథ్యం !
తమ అభివృద్ధిలో సాటి వాని సామర్థ్యానికీ ప్రాధాన్యత నిచ్చెడి అత్యుత్తమ సువ్యక్తిత్వ చైతన్య స్రవంతి !
విశ్వ నిత్య సత్య సుప్రకాశ తేజోభివృద్ధికై విశ్వ మానవాళి సమైక్యంగా నడవాల్సిన సమయం !
అవమానాలు, విద్వేషాలు, విడనాడి, అందరి కోసం అందరై, అందరిలో ఒక్కరై, ముందుకు సాగాల్సిన నేపథ్యం !
భారతీయ సంస్కృతి, తరతరాల వేద ధార్మికత, ఎల్లవేళలా విశ్వ సురక్షా జీవన పథంలో చక్కని మార్గదర్శి !
విశ్వ మానవాళి నేడు యోచించాల్సిన ముఖ్య విషయం, యావత్ విశ్వ జీవ సురక్షాత్మక జీవనం !
వసుధైక కుటుంబక నిర్మాణంలో, విశ్వ మానవాళికి కావాల్సిన ప్రధాన ఇతివృత్తం, విశ్వ జీవకారుణ్యతా భావన !
సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిర్భయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ !
రచన :
గుళ్లపల్లి ఆంజనేయులు
మొబైల్ ఫోన్ నెంబర్ :
9848369618
Gullapalli Anjaneyulu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి