🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 31*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*చతుషష్ట్యా తంత్రైః సకల మతిసన్ధాయ భువనం*
*స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః |*
*పునస్త్వన్నిర్బన్ధా దఖిల పురుషార్థైక ఘటనా*
*స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ ‖*
ఏ దేవత ఉపాసనైనా స్థూల రూప, మంత్ర, తంత్రములుగా ఉంటుంది. ఒక దానిని మించి ఒకటి సూక్ష్మం. తంత్రమంటే ఒక మంత్రము ద్వారా ఆ మంత్ర దేవతను ఎలా ఉపాసించాలో తెలియచెప్పే విధానం.
సౌందర్యలహరిలో అమ్మవారి స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలను చెప్పారు శంకరులు.
స్థూల రూపం = ధ్యానయోగ్యమైన దివ్యమంగళ విగ్రహ రూపం.
సూక్ష్మ రూపం = మంత్ర రూపం
సూక్ష్మతర రూపం = కుండలినీ రూపం
సూక్ష్మతమ రూపం = నిరుపాధిక (ఉపాధి లేని) నిర్గుణ సత్వ రజస్తమో గుణములకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపం.
ఇక్కడ నుండి మూడు శ్లోకాల్లో అమ్మవారి మంత్ర విద్యను ఆవిష్కరిస్తున్నారు.
సకలమతి సంధాయ భువనం స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః = అమ్మవారి కోరికపై పరమేశ్వరుడు సకల భువన వాసులకు లౌకిక, పారలౌకిక సిద్ధులనిచ్చేటటువంటి
చతుః షష్ట్యా తంత్రైః = 64 శాక్తేయ తంత్రములను చేశారు.
అయితే అమ్మవారు ఈ మంత్రములు గొప్పవైనా మోక్షమును ఇవ్వగలిగేవిగా లేవని అభిప్రాయపడి
పునస్త్వన్నిర్బంధా = పునః పునః నిర్బంధించింది ఆయనను అందుకు తగిన తంత్రమును చేయమని.
అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ = భూమండలంలో అసమానమైనది ముందు చెప్పిన 64 తంత్రములకు స్వతంత్రంగా ఉండేది అయిన శ్రీవిద్యా తంత్రమును అప్పుడు ఆయన దక్షిణామూర్తిగా చేశారు.
లలితా సహస్ర నామములలో *స్వతంత్రా సర్వతంత్రేశీ*, *దక్షిణామూర్తి రూపిణీ*, *శివజ్ఞానప్రదాయినీ* ఈ తంత్ర విద్యా రచనకు సంకేతాలు. అలాగే *చతుఃషష్ట్యుపచారాఢ్యా*, *చతుష్షష్టి కళామయీ |*
*మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా* అనే నామాలు కూడా.
64 తంత్ర గ్రంథములు చేసి సమస్త ప్రపంచమును తన మాయ చేత మోహింపచేసిన శివుడు, స్థిమితముగా నుండెను. అయినను భక్తులయడల ప్రేమతో అమ్మ కోరిక మేరకు ఈ శ్రీవిద్యాతంత్రమును మానవులకి అవతరింప చేసెను.
విశ్వమంతా నిండి ఉన్నది బ్రహ్మవిద్య. తనగురించి చెప్పునది ఆత్మవిద్య. ఈ రెండింటినీ సమన్వయ పర్చునది శ్రీవిద్య. ఇది మోక్ష ప్రదాయిని. మిగిలిన విద్యలన్నిటికంటే అతి ఉత్తమమైనది.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి