కృషీవలుడే..ఇలభీమబలుడు...
సీ..
పుడమికి చెలికాడు పుష్టిగూర్చెడివాడు
కష్టనష్టములెల్ల కాడితోనె
పైరుల కాపరై ప్రకృతికి నెదురొడ్డి
ఆ..ధైర్యపయనంబు హలముతోనె
జోడెడ్లు తలపాగ జోదైన బలిమిగా
సేద్యంపు భూమితో సిరులు తానె
రైతురాజ్యముగదా రామరాజ్యమనంగ
భారతావనికెల్ల వరము తానె
తేగీ..
పృథ్వి నిలువంగ నన్నిటన్ వెన్నెముకగ
కృషికి నిలువెత్తు రూపమై గెలిచెననగ
పదుగురకునీడనిచ్చెడు పాదపమన
రైతు కష్టంబె లోకాన రక్షయగుగ..
అట్టికర్షకమూర్తికే నంజలింతు...
రైతు దినోత్సవం సందర్భంగా...
రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి