16, అక్టోబర్ 2021, శనివారం

తత్వం తలకెక్కింది

 తత్వం తలకెక్కింది రోకలి తేరా తలకు చుడదాం అన్నాడట వెనకటికి ఒకడు అని మనం సహజంగా కొన్ని సందర్భాలలో వాడుతూ ఉంటాం.  బహుశా రోకలి కూడా బ్రహ్మ పదార్థం కాబట్టి తలకు చుట్టవచ్చని అని వుండొచ్చని నేను అనుకుంటున్నా. 

ఈ రోజుల్లో ఉదయం టీవిలో వచ్చే జాతకాల అదే రాశిఫలాలు కార్యక్రమం చుస్తే నాకు ఈ కోవకు చెందినట్లు అనిపిస్తున్నది. ఎందుకంటె టీవిలో వచ్చే ప్రముఖ జ్యోతిస్యులవారు ఇలా చెపుతున్నారు 

ఈ రోజు మీరు ధరించవలసిం వస్త్రం రంగు ఇలా ఉండాలి, ఈ రోజు మీరు ఫలానా దిక్కుకు ప్రయాణం చేయాలి, మీరు ఫలానా ది దైవాన్ని పూజించాలి, ఫలానా పూలతో, ఫలానా పండ్లతో పూజించాలి అని ఇలా చెపుతుంటే ఎంతమంది ఆచరిస్తున్నారో కానీ అది ఎంతవరకు సమంజసమో మాత్రం నాకు తెలియటం లేదు. 

రాసి ఫలాలు అంటే ఏమిటో అవి ఒక జాతకుని మీద ఎంతవరకు ప్రభావితం చేస్తాయో ఒకసారి పరిశీలిద్దాం . 

మనం చూసే రాశిచక్రం 12 గదులు కలిగి ఉంటుంది. అంటే ఒక పూర్ణం అంటే వృత్తం 360 డిగ్రీలు ఉంటే దానిని 12 తో భాగిస్తే ఒక్కో గదికి 30 డిగ్రీలు వస్తాయి. 

ఇక మనకు వున్న 27 నక్షత్రాలను వాటి పాదాలతో రాశి చెక్రన్ని విభజిస్తే అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి అంటే 27x 4 పాదాలు వెరసి 108 పాదాలు వస్తాయి  ఈ 108 పాదాలను 12 గదులలో విభజిస్తే అంటే 108/12=  9 పాదాలు వస్తాయి. అంటే ఒక్కొక్క గదిలో మనకు 3 నక్షత్రాల పాదాలు వస్తాయి. 

ఒక్కొక్క రాసి గదిలోని ఫలితాలను రాసి ఫలితాలుగా చెపుతారు అంటే అవి ఒక నిర్దుష్ట జాతకునికి సంబందించిన ఫలితాలు కావని మనం గుర్తుంచుకోవాలి. ఫలితాలు అనేవి ఒక నక్షత్ర జాతకులకు  కూడా వారి వారి నక్షత్ర పాదాలను బట్టి ఫలితాలు ఉంటాయి అని గమనించండి. ఈ సందర్భంలో నేను ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నా కొద్దీ సమయ తేడాతో జన్మించిన కవలపిల్లలు ఒకే రాశికి చెంది  వుంటారు. అంటే మనం రాసి ఫలితాలను నిర్దుష్టంగా ఆపాదించుకుంటే ఆ ఇద్దరికీ ఒకేరకమైన ఫలితాలుఉండాలి.  కానీ ఇద్దరిలో కొన్ని విషయాలు సామ్యం ఉంటే ఉండొచ్చు కానీ పూర్తిగా మాత్రం ఉండదు.  అది మనం చూస్తూ  వున్నాం. కవలపిల్లలలో ఒకరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళితే ఇంకొకరు అందుకు భిన్నంగా కూడా ఉండొచ్చు.  అంతేకాక ఒకరు దీర్ఘాయుష్కులు అయితే ఒకరు అల్పాయుష్కులు  కావచ్చు. ఒక రాసి ఫలితం అని చెప్పేది ఆ రాశిలో జన్మించిన 3 నక్షత్రాలు మరియు 9 పాదాల సమగ్రపు అంచనా మాత్రమే ఒకరకంగా ఆలోచిస్తే ఆ రాశిలో జన్మించిన వారిలో చాలా కొద్దిమందికో లేక వారికీ కూడా కాకుండా వర్తించవచ్చు లేక వర్తించక పోవచ్చు. అటువంటప్పుడు ఈ రాశివారు ఈ రంగు వస్త్రాలు ధరించాలి,  ఈ దిశకు మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పటం ఎంతవరకు సబబో విఘ్నుల వివేకానికే వదిలి వేస్తున్నాను.  దయచేసి టివిలో చూపెట్టేది ప్రతిదీ మూర్ఖంగా ఆచరించవలదని ప్రార్ధన. 

దయచేసి ఇది జాతకాలను, రాసి ఫలాలను విమర్శించటానికి వ్రాసిందిగా భావించవలదు.  కేవలం రాశిఫలాలు మూర్ఖంగా నమ్మవలదని తెలిపే ఉద్దేశ్యమే కానీ మరొకటి కాదు.   జాతక ఫలితాలు జ్యోతిష్యుని సమర్ధత మీద దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క జ్యోతిష్క్యునికి ఒక్కొక్క విధంగా జాతకం  గోచరించవచ్చు. వరాహమిహురుని వృత్తాంతమే ఇందుకు నిదర్శనం. జాతకాన్ని నమ్ముకొని జీవనం గడపటం కన్నా భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్ముకొని జీవనం సాగిస్తే ఆ దైవం ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటాడు, ఇది సత్యం. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ బుధజన విధేయుడు 

భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: