🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.
తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.
మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...
తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?"
డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో ఉన్నది ఒకటి చెప్పనా.. 'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం.
అదంతా ఆ భగవంతుని మాయాలీలలు. డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.
నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను.
తండ్రి కోపంతో రగిలిపోతూ "మనది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక" అంటూ గొణుకుంటున్నాడు.
డాక్టర్ కొన్ని గంటల తరువాత వచ్చి తండ్రితో "భగవంతునికి ధన్యవాదాలు... మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్స్ తో చెప్పండి."
అని.. ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు.
తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు* *ఇంత కఠినాత్ముడు. కొన్ని నిముషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు.
నర్స్ కొన్ని నిముషాల తరువాత ... కన్నీళ్ళతో "ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంటులో చనిపోయాడు.
మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు.. స్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి మళ్ళీ స్మశానానికే వెళ్లారు" అని చెప్పింది.
ఆయనే డాక్టర్ బీ. సీ. రాయ్🙏🏻
** ** **
స్మరించుకోదగ్గ...తెలుసుకోదగ్గ మహనీయులు..
చరిత్రలో ఒకేసారి వైద్య వృత్తికి సంబందించిన FRCS, MRCP పట్టాలు పొందిన అతి కొద్ది మందిలో వీరొకరు. ఈయన West Bengalకి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు.
** ** **
కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల భాధ్యతని, గౌరవాన్ని పెంచుతాయి. ప్రపంచంలో మంచీ చెడు రెండూ ఉన్నాయి. మన భాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే...
అలంటి డాక్టర్లను సమాజం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. వారు సదా స్మరణీయులు.
నిజానికి ఇటువంటి డాక్టర్లు ఇప్పుడు వున్నారా అంటే దాదాపు లేరనే చెప్పాలి, ఎక్కడో కానీ వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల శ్రర్ధ వున్నవారు అరుదుగా తారస పడతారు. చాలామంది డాక్టర్లు రోగులకు అవసరం వున్నా లేకున్నా ఎన్నో టెస్టులు వ్రాసి వాటి రిపోర్టులు చూసి మీకు ఆ లోపం వుంది ఈ లోపం ఉందని చెప్పి అనేక రకాల మందులు వ్రాసి రోగుల జేబులు గుల్ల చేయటమే కాక వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. చిన్న చిన్న రుగ్మతలకు కూడా చాల ఖరీదైన ఆంటిబయోటిక్స్ వ్రాస్తూన్నారు దానివల్ల అప్పటికి ఆ రోగం వెంటనే తగ్గినా ఆ మందుల ప్రభావం రోగి శరీరంలో వుంది రేపు ఏదైనా పెద్ద రోగం వస్తే ఆ మందులు పనిచేయని పరిస్థితి కూడా ఉండవచ్చు.
నేను విన్న ఒక వృత్తాంతం ఇక్కడ వ్రాయదలచుకున్నాను.
నా మిత్రుడు చెప్పినది ఏమంటే విజయవాడ వైపు వెళ్లే ఒక బస్సులో ఒక ధనిక వ్యాపారవేత్త ప్రయాణిస్తున్నాడట. ఆ బస్సు బయలుదేరి చిన్నగా ట్రాఫిక్లో వెళుతుంటే అతనికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ కనపడింది బస్సు కూడా ట్రాఫిక్ వల్ల నిదానంగా వెళుతున్నది. కండక్టర్ని అడిగి అతను అక్కడ దిగి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకుందామని ఆ హాస్పిటల్లోకి వెళ్ళాడు. రెసిపీషనిస్టు కన్సల్టేషన్ ఫి తీసుకొని ఒక డాక్టరు వద్దకు పంపింది సదరు డాక్టరుగారు మన ఆసామి వాలకం చూసి పెద్ద చేప వలలో పడ్డదని మీకు హార్టులో ప్రాబ్లమ్ వుంది అని టెస్టులు వ్రాసారు. ఒక గంట తరువాత రిపోర్టులు వచ్చాయి. అవి చూసి డాక్టరు గారు మీరు చాలా అదృష్టవంతులు తొందరగా వచ్చారు లేకపోతె మీరు రెండు మూడు రోజుల్లో చనిపోగలరు అని భయపెట్టి మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని సూచించారు. దానితో మన వ్యాపారవేత్తకు కళ్ళు తిరిగాయి అయ్యా నేను పూర్తిగా ఆరోగ్యంగా వున్నాను బస్సులో హాస్పిటల్ బోర్డు చూసి సాధారణ చేకుప్ కోసం దిగాను నిజానికి నాకు ఎలాంటి యిబ్బంది లేదని అంటే అప్పుడు సదరు డాక్టరు గారు మీకు తెలియంది గుండె జబ్బులు మీకు ఎలాంటి సింటమ్స్ లేకుండానే వస్తాయి. ఇప్పుడు మీకు ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేయకపోతే వెంటనే చనిపోతారని భయపెట్టాడు. చేసేది లేక తన దగ్గర వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న రెండు లక్షలు హాస్పిటల్లో కట్టి ఆపరేషన్కి తయారయ్యాడు. మిగితా డబ్బులు తీసుకొని రమ్మని మీ వాళ్ళకి ఫోన్ చేయండి అని రిసిప్షనిస్ట్ చెపితే ఫోన్ చేసి మరుసటి రోజు అంతా (పీ ఎంతోనాకు చెప్పలేదు) కట్టారు. ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. హమ్మయ్య ఇక నాకు ఏ ప్రమాదం లేదనుకొని సదరు వ్యాపారవేత్త తాన ఊరికి వెళ్ళిపోయాడు. పూర్తిగా కోలుకోవటానికి ఒక నెల పట్టింది.
ఎందుకైనా మంచిదని తన కుటుంబ MBBS డాక్టర్కి జరిగినది అంతా వివరించి తన వద్ద వున్న రిపోర్టులు అన్ని చూపించి నేను హైదరాబాదులో ఉండబట్టి సరిపొయిన్ది ఇక్కడే ఉంటే నా పని ఏమయ్యేది అని అన్నాడు. సదరు డాక్టరు ఆ రిపోర్టులు అన్ని కీలంకుశంగా చూసి ప్రశ్నర్ధకంగా ముఖం పెట్టాడు. ఏమిటని వ్యాపారవేత్త అడిగితె అయ్యా మీకు ఎలాంటి హార్ట్ సమస్య లేదు అన్ని రిపోర్టులు బాగున్నాయి. మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఎందుకు చేసారో నాకు అర్ధం కావటం లేదు అని అన్నాడు. అప్పటినుండి తానను హైదరాబాదు డాక్టరు మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజడని తెలుసుకొని మనస్తాపానికి గురి అయ్యి రెండు నెలలకు మనోవ్యాధితో మరణించాడట.
ప్రస్తుతం ధనవంతులు పెద్ద పెద్ద హాస్పిటళ్లు కట్టి అధునాతనమైన వైద్య పరికరాలను లక్షలు, కోట్లు పోసి కొని వున్నారు. వారికి సరైన రిటర్న్స్ రాకపోతే వారి పెట్టుబడి నష్టపోతారని డాక్టర్లను అవసరం వున్నా లేకున్నా అనేక టెస్టులు వ్రాయాలని అందులో వాళ్లకు కమిషన్ ఇస్తామని మభ్యపెట్టి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు మనం అనేక వార్తల్లో చూస్తున్నాము.
వైద్యో నారాయన్హరిః అన్నారు అంటే వైద్యులు సాక్షాత్తు నారాయణ స్వరూపులని ఆర్యోక్తి. కానీ ప్రస్తుతం వారు యమధర్మరాజు స్వరూపాలుగా మారుతున్నారు.
సమాజానికి వైద్యులు మంచి సేవలు అందించాలని ఆశిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి