19, ఫిబ్రవరి 2022, శనివారం

కాశీ యాత్ర

 కాశీ యాత్ర డిసెంబర్ 2021 అప్డేట్..


01.కాశీ లో బెనారస్ రైల్వే స్టేషన్ నుండి రామతారక ఆంధ్రాశ్రమం కు   ఒక ఆటో కి 200 రూపాయలు తీసుకుంటారు.. ఒక ఆటో లో 4 గురు నుండి 5 వరకు వెళ్ల వచ్చు..

నోట్: అయతే ఆటో వాలకి  ఆంద్ర ఆశ్రమం అంటే తెలీదు బెంగాలీ టోలి స్కూల్ అని  చెబితే అక్కడ దించుతారు .. అక్కడ నుండి  నడుచు కుంటూ రామతారక ఆంధ్రా అశ్రమం  మరియు సైకిల్ బాబా అశ్రమం కి వెళ్ల వచ్చు... 


★అశ్రమం లో ఎవరు రూమ్ తాళం వారే కోనుక్కోవాలి... మీరు ఇంటి దగ్గర నుండే తాళంఉంటే  తీసుకొని వెళ్ళటం మంచిది.. అలాగే రూమ్ స్ లోపల సెల్ ఫోన్ ఛార్జ్ లు పెట్టటానికి బోర్డ్ లు ఇబ్బంది గా ఉంటే ముందుగానే మీ వెంట ప్లస్ బాక్స్ ని మీ ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్ళటం మంచిది ఒకే సారి రెండు మూడు సెల్ ఫోన్ ఛార్జింగ్ లు పెట్టుకోవచ్చు.. అశ్రమం లో కి వేడి నీళ్లు కెటిల్ కూడా తీసుకొని వెళ్లొచ్చు.. 


★ఆంధ్ర అశ్రమం లో రూమ్  లు కాలి లేక పోతే దాని బ్రాంచు కైలాస్ భవనం ఉంటుంది.. అక్కడ రూమ్ లు ఇస్తారు..ఈ కైలాష్ భవనం కొంచెము పురాతనమ్ గా ఉంటుంది.. 

★ఆంధ్ర అశ్రమం లో ఒక వేళ రూమ్ దొరికే మద్యాహ్నం భోజనమ్ మరియు రాత్రి కి టిఫిన్ ఫ్రీ గా ఇస్తారు.... ఒక రూమ్ లో 4 వరకు వుండొచ్చు..  అయితే రోజుకు 300  రెంట్  పడుతుంది.. చిన్న పెద్ద రూం లు బట్టి రెంటు మారుతూ వుంటుంది... 

★ఈ ఆంధ్ర అశ్రమం మానస సరోవర్ ఘాట్ కి ఎదురుగా  ఉంటుంది... ఫోన్ నెంబర్: 05422450418..


★కాశీ  లోకల్లో  టెంఫుల్స్  తిరగటానికి ఆటో కానీ సుమో కానీ మనిషి కి 100 రూపాయలు లేదా 150 వరుకు  తీసుకుంటారు ...6 నుండి 7 వరకు వెళ్లొచ్చు   ఆ ఆటో వాళ్ళు వ్యాస కాశీ తో పాటు తులసి మందిర్ ,కినారం బాబా అశ్రమం , హనుమాన్ టెంపుల్, తిలబండేశ్వర్ మందిర్, కాలభైరవ మందిర్ , మహా మృత్యుంజయ మందిర్, బిందు మాధవి మందిర్, గవ్వలమ్మ గుడి .అయితే ఇవన్నీ ముందుగానే ఆటో వారితో మాట్లాడుకోవాలి...


★కాశీ లో  దేవతా దర్శనాలు 


01. ముందుగా కాలభైరవ సామీ ని దర్శనమ్ చేసుకున్నాక విశ్వనాథ మహా రాజు ని దర్శనమ్ చేసుకోవాలి... 

02. కాశీ విశ్వనాధ మహరాజ్ 

03.కాశీ విశాలాక్షి అమ్మవారు 

04.కాశీ అన్న పూర్ణ అమ్మవారు 

05.సాక్షి గణపతి 

06.దుండి గణపతి 

07.వారాహి అమ్మవారు 

08.సంకట విమోచన ఆంజనేయ స్వామి 

09.తిలబండేశ్వర్ స్వామి 

10.మహా మృత్యుంజయ టెంపుల్

11.సూర్య దేవుడు లోలార్క్ కుండం 

12.గవ్వలమ్మ గుడి 

13.బిందు మాధవ్ మందిర్ 

14.గంగా హారతి 

15.కెదారేశ్వర్ మందిర్ 

16.మణి కర్ణిక ఘాట్ (ఈ మణి కర్ణిక ఘాట్ లో మద్యాహ్నం 12 గంటలకు స్నానం చేస్తే దేవతలు వచ్చి వుంటారు అని నమ్మకం)


★కాశీ విశ్వనాధ్ మందిరం లోకి సెల్ ఫోన్ లు మరియు పెన్ లు కూడా తీసుకొని వెళ్ల నీయరు.. ముందుగానే లాకర్ లో పెట్టుకొని వెళ్ళాలి.. లాకర్ ఫ్రీ గా ఇస్తారు కానీ వాళ్ల దగ్గర బిల్వ పత్రం , పాలు కొనాలి.. 50 రూపాయలు వరుకు ఉంటుంది... 


★ కాశీ అన్న పూర్ణ అమ్మ  భోజన శాలలో  ఉదయం 9 గంట లనుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత అన్న ప్రసాదం (భోజనం )  పెడతారు... 


★ గంగా హారతి  సాయంత్రం 6.15 ని: లకు  దశాశ్వమేధ ఘాట్ లో  నిర్వహిస్తారు... 


★కాశి లో బోటు లో మణికర్ణిక ఘాట్ నుండి హరిచంద్ర  ఘాట్ లు వరకు మనిషి కి 150 నుండి అడుగుతారు (సాగర్ బోటు సర్వీస్. బోటు డ్రైవర్ మధన్  (ph: 9918167514, 9839092882 ) 


★కాశీ నుండి ప్రయాగ (త్రివేణి సంగమం )

అశ్రమం నుండి వెహికల్ బుక్ చేసుకొని వెళ్లొచ్చు..(తేదీ 06.12.2021 ) తేదీ నాటికి రేట్లు  ఆంధ్ర అశ్రమం నుండి  తుపాన్ వెహికల్ కి   4000 రూపాయలు తీసుకున్నారు .. అయితే దీనిలో 12నుండి 13  మంది వెళ్లొచ్చు.. అంటే ఒక మనిషి కి 350 రూపాయలు పడుతుంది.. అయితే 

ఈ ప్రయాగ ట్రిప్ లో   త్రివేణి సంగమం తో పాటు 

అష్టాదశ శక్తి పీఠాలు లో ఒకటి అయిన మాధవేశ్వరి అమ్మవారి ని , ఆనంద భవన్ (నెహ్రు ఇల్లు ), సీత మండి, వాల్మీకి అశ్రమం  చూపిస్తారు..ప్రయాగ లో బోటు కి ఒక మనిషి కి 200/రూ వరుకు డిమాండ్ చేస్తారు కానీ  150 రూపాయలు  కి మాట్లాడొచ్చు .... 

 మధ్యలో బోజనమ్ కి ప్రయాగ లో  దర్గంజ్ రైల్వే స్టేషన్ దగ్గర లో  తులసి మట్ అనే సత్రం (బాలాజీ మీల్స్ )(Ph.09793619980, 9839517333) ఉంటుంది.ఇక్కడ  ఆంధ్ర భోజనం దొరుకును..మనిషికి 100 రూపాయలు ..


★కాశీ నుండి గయ 

కాశి నుండి గయ తుపాన్ వెహికల్ కి 12 నుండి 13 మందికి 7500/రూపాయలు( తేదీ డిసెంబర్ 2021 నాటికి) తీసుకుంటారు...

గయ లో పంతులు గారు కి ప్యాకేజి ఉంటుంది. ఒక మనిషికి పిండానికి 1200 /రూపాయలు మరియు భోజనానికి 120 /రూ. తీసుకున్నారు.. ఇప్పుడు ఇంకా పెరగొచ్చు .మరియు పిండం పెట్టె టప్పుడు పంతుళ్ళు 200/రూ. నుండి 500/రూ. వరకు గుంజేస్తారు... 

గయలో పిండ ప్రధానం మరియు విష్




కామెంట్‌లు లేవు: