19, ఫిబ్రవరి 2022, శనివారం

పంచపాత్ర

 *పంచపాత్ర.*


పంచపాత్ర అనేది ఒక పాత్ర కాదు. ఆరాధన సమయంలో ఐదు పాత్రల్లో శుద్ధోదకం తెచ్చుకోవాలి. అయితే సాధారణంగా ఒకే పాత్రలో అన్నీ ఉంచి, ఏదో మమ అనిపించేస్తాం.


*01. అర్ఘ్య పాత్ర*

భగవంతుని హస్తాలు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాల పాత్ర.


*02. పాద్య పాత్ర.*

స్వామి వారి పాదాలను శుభ్ర పరిచే శుద్ధ జలాల పాత్ర.


*03. ఆచమనీయ పాత్ర.*

భగవంతుడు పుక్కిలించడానికి ఉపయోగించే జలాల పాత్ర.


*04. స్నాన పాత్ర.*

స్వామి వారి స్నానార్థం ఉపయోగించే  జాలాల పాత్ర.


*05. శుద్ధోదక పాత్ర.*

భగవదర్పితంగా సమర్పించే జలాల పాత్ర.


ఈ ఐదింటినీ పంచపాత్రలు అంటారు.


ఇవి గాక షోడశోపచారాలు చేశాక తీసిన నిర్మాల్య జలాలు నింపే పాత్రను ప్రతి గ్రాహక పాత్ర అంటారు. మరిన్ని నీళ్ళు అవసరమైతే సిద్ధంగా ఉంచుకొన్న జలాల పాత్రను శుచ్చ జలపాత్ర అంటారు. 


ఆచార్య పూజ చేయడానికి ఉపయోగించే జలపాత్రను ఆచార్య పూజా పాత్ర అంటారు.


*శుభంభూయాత్.🙏*

కామెంట్‌లు లేవు: