ప్రశ్న పత్రం సంఖ్య: 38 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) మహిళలు పేరంటానికి వెళ్ళితే కాళ్లకు ఇది రాస్తారు
i ) కుంకుమ ii ) పసుపు iii )సున్నిపిండి iv ) ఆముదం.
2) ఇంట్లో ట్యూబెలైటు చెడిపోతే ఇతనిని పిలుస్తాము
i ) తాపీ మేస్త్రి ii ) ప్లంబర్ iii ) కార్పెంటర్ iv ) ఎలక్ట్రీషన్
3) నాలుగు వేదాలలో ఒక్క వేదానికి మాత్రం రెండు భాగాలు వున్నాయి అది
i ) సామవేదం ii ) ఋగ్వేదం iii ) అధర్వణ వేదం iv ) యజుర్వేదం
4) రామాయణంలో క్రింది పాత్ర లేదు
i ) ద్రౌపతి ii ) లక్ష్మణుడు iii ) హనుమంతుడు iv ) సుగ్రీవుడు
5) మృత సంజీవిని విద్య కచునికి ఉపదేశించినది ఎవరు
i ) వసిష్ఠుడు ii ) విశ్వామిత్రుడు iii ) శుక్రాచార్యుడు iv ) అత్రి మహర్షి
6)కన్యాశుల్కం నాటకాన్ని వ్రాసింది ఎవరు.
i ) పానుగంటి నరసింహారావు ii ) గురుజాడ అప్పారావు iii ) శ్రీనాధుడు iv ) పోతనామాత్యుడు
7) పంచ లోహాలతో ఇది లేదు
i ) అల్యూమినియం ii ) ఇనుము iii ) రాగి iv ) వెండి
8) ఋక్కు అనునది________ సంబందించినది
i ) వేదానికి ii ) ఉపనిషత్తుకు iii ) రామాయణానికి iv ) పురాణానికి
9) ప్రబంధానికిఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి
i ) మూడు , ii ) ఆరు iii ) నాలుగు iv ) ఐదు
10) మనిషి చేతి గీతాలను చూసి జాతకాన్ని చెప్పే దానికి ______అని పేరు
i ) పామిస్ట్రీ ii ) హరోస్కోప్ iii ) ఎపిమర్సు iv ) కుండలిని
11) శ్వేతాంబరులు అనగా
i ) జైన మతపు ఒకశాఖ వారు ii ) బౌద్ధ మతస్తులు iii ) శిక్కు మతస్తులు iv ) హిందూ మతంలో ఒక శాఖ వారు
12) అరణి అనునది క్రింది దాని పని చేస్తుంది
i ) అగ్గిపెట్ట ii ) నశ్యపు బుడ్డి iii ) రోలు పొత్రం iv ) పాన్ పెట్టె
13) సూర్యుని కాంతిలో ____ రంగులు ఉంటాయి
i ) ముప్ఫయి ii ) ఆరు iii )ఏడు iv ) తొమ్మిది
14) మన గృహవసారాలకు వాడుకునే విద్యుత్తు
i ) A.C ii ) D.C iii ) static electricity iv ) stored Electricity
15) ఇనుము, అల్యూమినియం రెంటిలో తక్కువ వేడిలో కరిగేది ఏది.
i ) ఇనుము ii ) అల్యూమినియం iii ) రెండు కూడా iv ) తక్కువ వేడిలో కరిగేది ఏది లేదు
16) ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు
i ) శ్రీ శ్రీ ii ) అల్లసాని పెద్దన iii ) తెనాలి రామకృష్ణ iv ) భట్టు మూర్తి
17) ప్రయాణికుల జెట్ విమానంకు ముందర ప్రొపెల్లర్
i ) ఉంటుంది ii ) ఉండదు iii ) ఉంటె ఉంటుంది లేకుంటే ఉండదు iv ) తప్పనిసరిగా ఉంటుంది.
18) విద్యుత్ మోటార్ ఈ శక్తితో తిరుగుతుంది
i ) విద్యుత్ అయస్కాతం శక్తితో ii ) రాగి తీగతో చేసిన కాయిలుతో iii ) స్థిర అయస్కాంత శక్తితో
19) అంబుజం అని దేనిని అంటారు
i ) తామర పువ్వు ii ) చేమంతి పువ్వు iii ) గులాబీ పువ్వు iv ) బంతి పువ్వు
20) తబలా అనునది ఒక
i ) చర్మ వాయిద్యం ii ) తంత్రీ వాయిద్యం iii ) వాయు వాయిద్యం iv ) విద్యుతు వాయిద్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి