14, ఆగస్టు 2020, శుక్రవారం

పోత‌న త‌ల‌పులో....(19)

జ‌గ‌ద్ర‌క్ష‌కుడైన కృష్ణ‌ప‌ర‌మాత్మ ఘ‌న‌త‌ను కీర్తించి,
జ‌నుల జ‌డ‌త్వాన్ని వ‌దిలించే ప‌ద్యం ఇది.

                                 ****
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
                                 ****
                       
న్యాయాన్ని మెచ్చువాడికి, చనిపోయిన‌ బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.వంద‌నం.

 🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️ భక్తి ముక్తిప్రదం🏵️

కామెంట్‌లు లేవు: