7, మార్చి 2026, శనివారం

శ్రీనివాస స్తుతి🙏

 🌸శ్రీనివాస స్తుతి🙏


సీ.వేంకటా చలపతి! వేగమే రావయ్య 

 సప్తగిరులు దిగి సాధుశీల!

అలమేలుమంగతోనాలసిం పకనిక 

శ్రీనివాసా! రావశీఘ్రముగను !

భక్తులబ్రోచెడి వరదుడా !బాధలు

దీర్చుమా !జనులకు దీనబంధు !

కొండల పైనున్న కోనేటి రాయుడా!

కోర్కెలు దీర్చుమా కూర్మితోడ !

తే,.. మునులుసైతము దర్శింత్రు ముక్తి కోరి!

మానవులపైనదయచూపు !మమత తోడ 

తిరుమలగిరిపైవెలసిన దివ్యమూర్తి!

నిత్యకళ్యాణములు!నీకు నిర్మలాత్మ!

. సాహితీ శ్రీ జయలక్ష్మి

కామెంట్‌లు లేవు: