17, డిసెంబర్ 2022, శనివారం

 Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

10వ దినము (17-12-2022):

అగ్ని:

తెలుగు: అగ్గి, అంగారకము, అంచతి, అగిని, అగ్నిహోత్రము, అనలము, అప్పితము, ఇంగలము, ఈషరము, ఉదర్చి, కవ్యవాలము, కిత్తి, కీనాశము, గర్భము, చిచ్చు, జ్యోతి, జ్వలనము, తేజము, ధూమకేతనము, నారాశంసము, నిప్పు, పర్పరీకము, పాకలము, పాచనము, పాథము, పావనము, పురజ్యోతి, బాణము, బాహులము, భాస్వరము, భుజము, మందసానము, సెగ, వహ్ని, సాచి, హవనము, హిమరాతి, హిరణ్యబిందువు.


ఆంగ్లము: Fire

కామెంట్‌లు లేవు: