*ॐ తిరుప్పావై*
*పాశురము : 2/30*
*భావము*
*భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా!*
*మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినండి.*
*శ్రీమన్నారాయణుని పాదారవిందములను కీర్తిస్తాము.*
*అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము.*
*పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము, శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము.*
*ఒకరిపై చాడీలను చెప్పము.*
*సత్పాత్రదానము చేతము.*
*సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము.*
*ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము.*
*ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము.*
*ఇదియే మన వ్రతము.*
*పాశురము*
*వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు*
*శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్*
*పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి*
*నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి*
*మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్*
*శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్*
*ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి*
*ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్*
https://youtu.be/Cl8ygMquTCw
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి