30, మే 2023, మంగళవారం

వాల్మీకి రామాయణం

 *వాల్మీకి రామాయణంలో లేని కల్లబొల్లి అసత్యపు అంశాలను మన వాళ్లు అనేకం పుట్టించారు. అందులో‌కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.*


🌹రావణుడు మరణించే లోగా అతని వద్ద రాజనీతి పాఠాలను నేర్చుకుని రమ్మని లక్ష్మణుని రాముడు పంపాడు అన్నది కూడా ఒక అబద్ధపు సృష్టి.


🌹గుహుడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అని పాటలు పాడి మరీ రాముడి కాళ్లు కడిగినట్లు రామాయణంలో కనిపించదు.


🌹సీతా స్వయంవరానికి రావణాసురుడు రావడం శివ ధనుస్సు పైన వేసుకుని అవమానం పాలు కావడం రామాయణంలో లేదు.


🌹లక్ష్మణ రేఖ రామాయణంలో కనిపించదు.


🌹అహల్యను గౌతముడు శిలగా మారమని శపించినట్లు రామాయణంలో లేదు. నిరాహారి భస్మ శాయి అదృశ్య రూపిగా పడి ఉండమని, ఆశ్రమానికి రాముడి రాక  ఆమెను పాప విముక్తురాలిని చేస్తుందని చెప్పినట్టు మాత్రమే  ఉన్నది. అది ఆమెకు ప్రాయశ్చిత్తమే గాని శాపం కాదు.


🌹సీత నిలబడి ఉన్న భూమిని పెళ్లగించి ఆ భూమి గడ్డతో సహా సీతను తీసుకుపోయినట్టు రామాయణంలో లేదు


🌹శబరి రాముడికి ఎంగిలి పండ్లు తినిపించినట్టు రామాయణంలో లేదు.


🌹రావణాసురుడి గర్భంలో అమృత కలశం ఉన్నట్లు, దానిని కాల్చి వేయడానికి రావణుడి నాభి భాగంలో బాణం వేయమని విభీషణుడు సూచించగా రాముడు అది ధనుర్విద్యా ధర్మానికి, నీతికి వ్యతిరేకమని చెప్పినట్లు, హనుమంతుడు తన తండ్రి వాయుదేవుడిని ప్రార్థించి రామబాణాన్ని కొద్దిగా కిందికి వంచి నాభిలో గుచ్చుకునేటట్లు చేశాడు అన్నది కూడా ఒక అబద్ధపు సృష్టి.


ఇలా తమ కల్పనా చాతుర్యం కొద్ది అనేకమంది రచయితలు అనేక కల్పితాలను పుట్టించి ఇవి వాస్తవాలే అని మనతో భ్రమింప చేశారు.

సత్యం తెలుసుకోవాలంటే దయచేసి తెలుగు అనువాదంతో సహా వాల్మీకి రామాయణం గోరఖ్పూర్ ప్రింటింగ్ ప్రెస్ వారి గీతా ప్రెస్ లో లభిస్తున్నది, చదవండి చదివి ఆ తరువాత అనుమానాలను అడగండి. అంతేగాని మూలంలో ఏముందో తెలియకుండా ఎవరు ఏది చెబితే అది దాన్ని గుడ్డిగా నమ్మేయడం ధర్మం కాదు.

కామెంట్‌లు లేవు: