🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ద్వితీయ స్కంధము*
*కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె*
*వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో*
*దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్*
*జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.*
శ్రీ మహావిష్ణువును పుండరీకాక్షుడు అంటారు. బాగా వికసించిన పద్మపు విశాల మైన రేకులవంటి కన్నులున్నవాడు. సృష్టిలో ఏర్పడే ప్రతిదానిని కార్యం అంటారు. దానికి కారణం ఒకటి వేరుగా ఉంటుంది. విత్తనం కారణం. చెట్టు కార్యం. కాని పరమాత్మా, జగత్తూ రెండూ విష్ణువే. మరొకరులేరు. నాయనా! అటువంటి భగవంతునీ, అంతము లేనివానినీ, లోకాల సముదాయాన్నంతటినీ భావిస్తూ ఉండేవానినీ ధ్యానిస్తూ ఉండాలి. నిజానికి ఆయనకు ఏ గుణాలూ లేవుగానీ మనలను ఉద్ధరించటానికి ఆయన కొన్నిగుణాలు ఏర్పరచుకొని మనయందు కృపతో తెలియవస్తూ ఉంటాడు. అటువంటి గుణాలను గొప్పగా సంస్కరించుకొన్న బుద్ధితో మనం కొనియాడుతూ ఉండాలి. అలా చేయకపోతే గుణాలు లేని పరమాత్మను మన మనస్సులు చేరవు. అది చాలాపెద్ద ప్రమాదం.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి