3, ఫిబ్రవరి 2021, బుధవారం

అసాధ్యమైనదేమీ లేదు

 🌼 ..... ఒక కథ చెబుతా విను..... 🌼


💐 భగవంతుడికి అసాధ్యమైనదేమీ లేదు 💐


🍂 నానక్‌ సంప్రదాయానికి చెందిన సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవుని గదిలో ప్రవేశించి, గౌరవసూచకంగా 'నమో నారాయణ” అని సంబోధించారు. గురుదేవులు వారిని కూర్చోమని చెప్పి, ఈ కథను చెప్పారు.


🍂 ఒక ప్రదేశంలో ఇద్దరు యోగులు తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు నారదమహర్షి ఆ వైపుగా వెళ్ళడం సంభవించింది. ఆ యోగులు ఆయనను

గుర్తించారు. వారిలో ఒక యోగి ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు: “స్వామీ! మీరు ఇప్పుడు భగవంతుని దగ్గర నుండే వస్తున్నారు కదా! ఆయన ఏం చేస్తున్నారండీ?”


🍂 నారదమహర్షి. “భగవంతుడు ఒక సూదిని పట్టుకుని, దాని బెజ్జం ద్వారా ఇటునుంచి అటు, అటునుంచి ఇటు ఏనుగులను, ఒంటెలను దూరుస్తున్నాడు!”


🍂 అది విన్న మొదటి యోగికి నారదుని మాటలు మీద నమ్మకం కలగలేదు. ఆయన నారద మహర్షితో: “ఏమిటి! భగవంతుడు సూది బెజ్జం లో నుంచి ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడా.? ఇది సాధ్యమయ్యే పనేనా.? మీరు వైకుంఠానికి వెళ్ళను లేదు. భగవంతుడు చేస్తున్న పనిని చూడనూ లేదు." అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.


🍂 రెండవ యోగి: “అయ్యా, ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది?

భగవంతుడికి అన్నీ సాధ్యమే!”


   అవును.


 🍂 "భగవంతుడికి అసాధ్యమైనదేమీ లేదు. ఆయనకు సర్వం సాధ్యమే!" అని గురుదేవులు పై కథను చెప్పి ముగించారు.

కామెంట్‌లు లేవు: