ఈ ప్రశ్నకు బదులేది 2
మను చరిత్ర మూడవ అస్వాసము నుండి కింద ఒక పద్యం ఇవ్వబడింది దాన్ని పూర్తిగా చదవండి.
పద్యం కింద ప్రశ్న ఇవ్వబడింది.
ఈరోజు మన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది.
చ. అపరిమితానురాగ సుమనోఽలస యై చిగురాకుఁ జేతులం
దపసిని గౌఁగిలించె వనితా? యిదె రంభ; దలంప రంభ దా
నపరిమితానురాగసుమనోఽలస యై చిగురాకుఁ జేతులం
దపసిని గౌఁగిలించు టుచితంబె కదా! యన నవ్వె రంభయు\న్.
ఈ పద్యములో
"చిగురాకు చేతులు"
అని రెండు చోట్ల సంబోధించారు.
ఆ రెండిటి అర్థం ఒకటేనా? వేరువేరా?
వేర్వేరైతే వాటి అర్థమేమిటి.
సవివరంగా వివరించగలరు.
ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
గమనిక:: మీ జవాబును కామెంట్ రూపంలో తెలియపరచగలరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి