28, నవంబర్ 2020, శనివారం

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


**శ్రీమన్నారాయణీయం**

 ప్రధమస్కంధం - 2-4-శ్లో.


తత్ తాదృజ్మధురాత్మకం, తవ వపుః సంప్రాప్య సంపన్మయీ

సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి।

తేనాస్యా బత కష్టమచ్యుత! విభో! త్వద్రూపమానోజ్ఞక-

ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్||


భావము: అచ్యుతా! విభూ! సిరి సంపదలకు నెలవైన లక్ష్మీదేవి నిన్ను చేరి, నీ వక్షస్థలమున స్థిరనివాసము ఏర్పరుచుకొనినది. మధురమైన నీ రూపమును విడిచి ఉండలేక భక్తులవద్ద చిరకాలము నిలవలేక పోవుచున్నది. నీ సౌందర్యానికి వశమై నిన్ను వదలలేని ఉత్సుకతతో నీ భక్తులవద్ద అస్థిరురాలు అగుట వలన లక్ష్మీదేవి చంచల అను అపవాదును సైతము పొందినది.

(telugubhagavatam.org)


వ్యాఖ్య : పోతనగారు, భట్టతిరిగారూ చెప్పినదాన్ని బట్టి నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. స్వామిపై  ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. అందువల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిలుపుకోవాలి. 


ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో, అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచి పెట్టి వెళుతుంది. కాబట్టి, సదా మనస్సులో నారాయణున్ని నిలుపుకోవాలి.


మరోవిషయం.  నిత్యం మనం ఇట్లో వెలిగించే దీపమే లక్ష్మీ రూపం. చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. 


అలాగే లక్ష్మీదేవి అష్ట రూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. వీటిలో విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద. 


ఒకసారి లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా శ్రీ మహావిష్ణువు చెప్పింది ఏంటంటే  "అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను. మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే అచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ ఈ.విషయాలు చెప్తారు.


1. మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అలుగుతుందట. అంతే కాదు అప్పు తొందరగా తీరదట. 


2. బుదవారం రోజు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదట. ఒకవేళ అదే పని పదేపదే చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుందట.


3. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట.


4. ఎంగిలి చేసినవి ఉంచ కూడదు. తామర పువ్వులు, జిల్వపత్రాలను ఎప్పుడు నలపరాదు.


5. నదులు, సరస్సులువంటి పవిత్ర జలాశయాల్లో సరస్సులలో, నదులలో మల మూత్ర విసర్జన చేయకూడదు. ఎక్కడపడితే అక్కడ అశుభ్రం చేస్తే లక్ష్మీదేవికి నచ్చదట.


6. ఇంటి గోడలు, తలుపులు, గడపలు లక్ష్మీస్వరూపాలు.  వీటిపై అవసరం లేనివి రాయకూడదు. అంటే బూతులు, చెడు వాఖ్యలు రాయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుందట.


7. పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు. చేతితోనే రుద్దుకొని కడగాలి.


8. అతిథిదేవో భవ అంటారు. అతిధి మర్యాదలలో లోపం చేయరాదు. పశువులను అనవసరం కొట్టకూడదు. దూషించకూడదు.


9. సాయం సంధ్యలో నిద్రించే వారింట లక్ష్మీ ఉండదు. సోమరితనంగా ఉండే ఇంట లక్ష్మీ కటాక్షించదు.


10. ఎవరింట్లో అయితే తరచూ గొడవులు జరుగుతూ మహిళలు ఏడుస్తుంటారో, ఆ ఇంటి లక్ష్మీ ఉండదు. (అలాగే వ్రృద్దులనుకూడా పట్టించుకోని ఇంట లక్ష్మీ దేవి ఉండక అలిగి వెలిపోతుందని గ్రహించాలి).


11. ఇంట్లో ఉదయం, సాయం సంధ్యవేళల్లో కనీసం అగరబత్తి , దూపంతోనైనా దేవతారాధన చేయాలి. అలా చేయకుండా ఉండే వారింట్లో మరియు తులసి చెట్టు పెట్టి, పట్టించుకోని ఇంట లక్ష్మీ అలిగి వెలిపోతుందట.


12. వ్యసనాలకు బానిసలు కారాదు. అలా చేస్తే లక్ష్మీ ఇంటి నుండి దూరం అవుతుంది.


13. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించేవారిదగ్గర లక్ష్మి నిలవదు.


14. ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ,జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీలు, నేలదిరిపోయేట్లు నడిచే స్త్రీలు ఉన్నప్రదేశాల్లో. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవటం ఇత్యాదులు లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి. స్వస్తి. 

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/KCfWMHlFNsM1PTptFf2RwR

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: