*హిందువులకు కూడా డ్రెస్ కోడ్ ఉంది. అదే బ్రాహ్మణ వేషం. తెలుసా?*
బ్రాహ్మణుల పిలక ప్రస్తావన పోస్టు చూసి నిజాలు చెప్పాలని ఉంది. పురాణాల ప్రకారం వర్ణాలు నాలుగు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు. వీరిలో 2/3 వంతు మందికి యజ్ఞోపవీతం, పిలక, ధోవతి - ఉత్తరీయం, చెవులకు కమ్మలు, మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రతీ వర్ణంలోనూ చాలా కులాలు ఉన్నాయి. అందరూ సమన సంఖ్యలో ఉన్నారని అనుకున్నా ఆ లెక్కన 75శాతం హిందువులకు ఉపనయనం, పిలక ఉందని తేలింది. దరిద్రం ఏమిటంటే వర్ణం పేరు ఉన్న కులాలు మాత్రమే పేరుకి 5శాతం ఉన్నాయి. మిగిలిన 70 శాతం వారిలో చాలా కులాలు శూద్ర వర్ణం వారు కాదు. *అసలు శూద్ర వర్ణం అంటే ఈ కులాలు అని ఎక్కడా లేదు. ఆచారం పాటించని పై మూడు వర్ణాల వారినే శూద్రులు అనే పదంతో పిలిచేవారు. ఆ లెక్కన శూద్ర కులాలు 10శాతం మించి ఉండకూడదు.* కాబట్టి ఇప్పుడు చరిత్రలో లేదా పురాణాలలో రాజరికం చేసిన కులాలు తిరిగి యజ్ఞోపవీతం, పిలక ధరించాలి. శ్రీరాముడుకి, శ్రీకృష్ణుడికి కూడా పిలక ఉందని రామాయణంలో, భారతంలో ఉంది. కమ్మ రాజులు, రెడ్డి రాజులు, యాదవ రాజులు, అడవిలో ఉండే కోయ రాజులు, గిరిజన జాతులలో ఉండే రాజులు,...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కులాలకు యజ్ఞోవీతము, పిలక ఉన్నాయి? ఈ మాత్రం తెలియకనే కాశీ పండితులు శూద్ర కులం అనుకునే శివాజీ మహారాజ్ కీ రెండో భార్యగా బ్రాహ్మణుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారా? క్షత్రియులకు చేసే పట్టాభిషేకం చేసి, శివాజీ మహారాజుకి ఛత్రపతి అనే బిరుదు ఇచ్చారా? హిందూ ఆచారాన్ని అందరూ పాటిస్తే సరిపోతుంది. ఆ రోజుల్లో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం మొఘలుల కాలంలో హిందూ ధర్మ రక్షణ చేస్తున్న రాజకుటుంబాల వారిని వెతికి మరీ చంపుతుంటే చాలామంది అగ్రవర్ణాల వీరులు విధిలేక యజ్ఞోపవీతం, పిలక తీసేసి తాము శూద్రులమని ప్రకటించి ఉండవచ్చు. *రాజ్యాలు పోయినా రాజసం పోతుందా? వారి కులాల వారే ప్రభుత్వ అధికారంలో నాయకులుగా ఉండటం అందరికీ తెలుసు.* కాబట్టి, ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని మన నాయకులు రక్షించాలంటే ముందుగా వారు యజ్ఞోవీతమును, చిన్న పిలకను, నుదుటిపై విభూతి రేఖలు, తిలకం, లేదా తిరు నామం (వెంకన్న బొట్టు), చెవి కమ్మలను, ఖద్దరు పంచె - ఉత్తరీయాన్ని ధరించాలి. ఒక వందేళ్ల క్రితం ఫోటోలు చూడండి. పురాణ కాలం నాటి మనుషుల డ్రెస్ కోడ్ చూడండి. ఇంకా, తప్పుగా అనిపిస్తే క్షమించండి. ధర్మం అనిపిస్తే పాటించండి.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి