5, ఆగస్టు 2023, శనివారం

సంస్కృత భారతీ* *5*

 *సంస్కృత భారతీ* 

           *5*

*పంచమ పాఠః*

*తుమున్ ప్రత్యయ విశేషః*

 తుమున్ ప్రత్యయం చేర్చినచో కొరకు అనే భావం వస్తుంది.

*ఉదా*:-- కర్తుం = చేయుటకు, కారయితుం = చేయించుటకు, గన్తుం = వెళ్ళుటకు, గమయితుం = పంపుటకు, భోక్తుం = తినుటకు, వక్తుం = చెప్పుటకు, ఆనయితుం = తెచ్చుటకు, ప్రాపయితుం = పొందించుటకు, ప్రాప్తుం = పొందుటకు, పఠితుం = చదువుటకు, గణితుం = లెక్కించుటకు, దాతుం= ఇచ్చుటకు... ఒకవేళ ఆ తుమున్ ప్రత్యయం ద్వారా కలిగే మార్పు తెలియక పోతే ఆ క్రియాపదానికి తదుపరి " కర్తుం" చేర్చి ప్రయోగించదగును.

*ఉదా*:-- గానం కర్తుం (గాతుం)= పాట పాడుట చేయుటకు( పాడుటకు), భోజయితుం/ భోజనం కారయితుం ఈ రెండింటికినీ భోజనం చేయించుటకు అనే భావమే కలుగుతుంది...ఇలా.

*ప్రయోగ విభాగః*

*ప్ర*:-- త్వం కుత్ర కిమర్థం గఛ్ఛసి? ... నీవు ఎక్కడ కు ఎందుకు వెళ్ళుచున్నావు?

*స*:-- అహం పాఠశాలాయాం ప్రతి పఠితుం గఛ్ఛామి... నేను పాఠశాల కు చదువుటకు వెళ్ళు చున్నాను.

*ప్ర*:-- త్వం శ్వః కుత్ర కిమర్థం గమిష్యసి?.. నీవు రేపు ఎక్కడ కు ఎందుకు వెళ్ళెదవు??

*స*:-- అహం శ్వః రాజమహేంద్రవరం పర్యన్తం గోదావరినదీస్నానం కర్తుం (నద్యాం స్నాతుం) గన్తుం ఇఛ్ఛామి... నేను రేపు రాజమహేంద్రవరం వరకూ గోదావరి నదీస్నానం చేయడానికి(నది లో స్నానం చేయడానికి) వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను....ఇలా ప్రయత్నం చేయగలరు.

*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: