5, ఆగస్టు 2023, శనివారం

🚩శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩* *భాగం 2*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*


*🚩శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩*   


*భాగం 2*


*ఓం నమో భగవతే రామకృష్ణాయ*


సంతానం కావాలనే తల్లి తండ్రుల హృదయపూర్వకమైన ఆర్తి, ప్రార్థన

ఫలితంగా ఈ లోకంలోకి వచ్చేవాడు శ్రేష్ఠతముడైన వ్యక్తిగా విరాజిల్లుతాడు. అలాంటి  భక్తిప్రపత్తులతో భువనేశ్వరి పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చింది. మొదట మగపిల్లవాడే జన్మించినప్పటికీ, అతడు విగతజీవుడయ్యాడు. తరువాత వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టారు. అందుకే మగపిల్ల వాడికోసం ఆమె ఆర్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది.


 ఒక సంవత్సరం అవిచిన్నగా ఆమె సోమవార వ్రత అనుష్టించింది. వారి బందువులలో ఒకరిని కాశీలో వెలసివున్న వీరేశ్వర శివునికి సోమవారాలలో తన తరఫున విశేష పూజలు చేయమని కోరింది. ఈ విధంగా భువనేశ్వరి ఒక సంవత్సర కాలంపాటు నిరంతరాయంగా జప, పూజ, పారాయణలతో తపోమయ జీవితం గడిపింది.


ఇలావుండగా ఒక రోజు పగలంతా ప్రార్ధనలోను, పూజలోను నిమగ్ను రాలైన భువనేశ్వరి ఆ రాత్రి ఒక కలకన్నది. ఆ కలలో శివుడు నుండి ప్రకాశమానమైన కాంతి వెల్లువలా వెలువడి భువనేశ్వరిని ఆవరించింది. అప్పుడు భువనేశ్వరి మనస్సు అనిర్వచనీయ ఆనందంలో ఓలలాడింది. ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చాలించి లేచి ఒక మగపిల్లవాడుగా మారిపోయాడు.


 "సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు కుమారునిగా జన్మించబోతున్నాడా! నా ప్రార్థనను ఈ విధంగా నెరవేర్చనున్నాడా? అంటూ భువనేశ్వరి మనస్సు ఫారవశ్యంతో నిండింది. ఇంతలో కల చెదరిపోయింది. మేల్కొన్న తరువాత కూడా ఆ కాంతి వెల్లువ తనను ఆవరించి ఉండడం ఆమె గమనించకపోలేదు.


 దైవసంకల్పం  వలన త్వరలోనే భువనేశ్వరి గర్భం దాల్చింది. 1863 జనవరి 12వ తేదీ సోమవారం (కృష్ణ సప్తమి, ధనుర్లగ్నం, కన్యారాశి, హస్తానక్షత్రం)

 ఉదయం ఆరు గంటల 33 నిమిషాల 33 సెకండ్లకు ఒక అందమైన మగబిడ్డకు భువనేశ్వరి జన్మనిచ్చింది. 

 

ఆరోజు మకర సంక్రాంతి .అనాడు ఉదయించిన బాలుడు సనాతన ధర్మమహాసాగరాన్ని ఉప్పొంగచేయటానికై, వేదాంత మతప్రకాశాన్ని ప్రాచ్యపాశ్చాత్య ఖండాల్లో అంతటా వ్యాపింపచేయటానికై, ఈశ్వరాంశసంభూతుడై ఉదయించిన బాలచంద్రుడని ఎరుగకే భారతజనసహస్రం ఆ పర్వదినాన ఆనందసాగరంలో ఓలలాడింది!


 కాశీ వీరేశ్వర శివుని అనుగ్రహం వలన జన్మించాడు కాబట్టి ఆ పిల్ల వాడికి విశ్వేశ్వరుడని నామకరణం చేశారు. ముద్దుగా 'బిలే'   అని నరేన్ అని పిలిచేవారు. ఆ తరువాత నరేంద్రనాథ్ అనే పేరు స్థిరపడింది.🙏


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: