శివానందలహరీ - 03
త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరం
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే
వేదముల్ మూడింట వేద్యుడయ్యెడి వాడు
నఖిల సృష్టికి నాది యైన వాడు
భక్త హృత్పద్మాన వరలు చుండెడి వాడు
త్రినయన యుక్తుండు త్రిపురహరుడు
కదలు సర్పంబులు కంఠహారములుగా
ఘన జటాజూటంబు గల్గు వాడు
శ్రీమహాదేవుండు చిత్ స్వస్వరూపుండు
నగజాతనాథుండు మృగధరుండు
శూల ఢమరుక రుద్రాక్ష శోభితుండు
భవ్య భస్మాంగ గాత్రుండు పావనుండు
పార్వతీదేవి సహితుడౌ పరమశివుని
నిందుభూషణు భజియింతు డెంద మందు. 03 @
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి