9, జూన్ 2024, ఆదివారం

ఉత్తమమైన ధర్మం*

 *ఉత్తమమైన ధర్మం* 

మహాభారతంలో భీష్మపితామహుడిని యుధిష్టిరుడు ఇలా అడుగుతాడు..

 *कोधर्मः सर्वधर्माणाः* 

 *भवतः परमोमतः* 

...అంటే అన్ని ధర్మములకంటే ఏది ఉత్తమమైన ధర్మం అని. అప్పుడు భీష్ములవారు -

 *एष मे सर्व धर्माणां* 

 *धर्मोऽधिक तमोमतः|* 

 *यद्भक्त्या पुंडरीकाक्षं* 

 *स्तवैरर्चेन्नरः सदा ||* 

పరమాత్మ అనేవాడొకడున్నాడు. ఆ పరమాత్మను నిత్యమూ అనన్యమైన మనస్సుతో ధ్యానించు, అదే ధర్మాలలోకెల్లా మహాధర్మం అని భీష్ములవారు సమాధానమిచ్చారు.

ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఉన్నది. "అయ్యా! దేవుళ్ళెంతమంది? ఒకరా, ఇద్దరా, వందనా, వేయిమందా?" ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందండీ అంటే మీరు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, అమ్మవారు, అయ్యప్ప అని ఎన్నో పేర్లు చెపుతుంటారు. ఈశ్వరుడికి పూజ చేస్తే విష్ణువుకు పూజ చేయగూడదంటారు. విష్ణువుకు పూజచేస్తే ఈశ్వరుడికి చేయగూడదంటారు. అందువలన మా మనస్సులో అనేక సందేహాలు కలుగుతున్నాయి, అంటారు కొందరు. మరి కొంతమంది ఇంత మంది దేవతలేమిటండీ ఎవర్ని పూజించాలో అర్థం కావటంలేదు అంటుంటారు.

అసలు విషయం తెలియకే ఈ సందేహాలు, గందరగోళం. అయితే అసలు విషయమేమిటంటే దేవుడు ఒకడే అన్నది మా సిద్ధాంతం.

 *एको देवः सर्वभूतेषु गूढः* 

 *सर्वव्यापी, सर्वभूतांतरात्माः |* 

 *कर्माध्यक्षःसर्वभूताधिवासः,*                          *साक्षीचेताकेवलो निर्गुणश्च ||* 

ఇదయ్యా అసలు విషయం. ఒకే పరమాత్మ సర్వాంతర్యామిగా ఉన్నాడన్నది మా సిద్ధాంతం. పరమాత్మలనేక మంది ఉండటానికి వీల్లేదు. సత్యసంకల్పుడు, సృష్టిస్థితిలయకారుడు అయిన పరమేశ్వరుడు ఒకడే.🍃🕉️🙏🌸

 *---జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* 


|| *हर नमः पार्वतीपतये हरहर महादेव* ||

కామెంట్‌లు లేవు: