9, జూన్ 2024, ఆదివారం

ప్రశ్న పత్రం 1/2024

 ప్రశ్న పత్రం 1/2024

కూర్పు చేరువేల భార్గవ శర్మ న్యాయవాది. 

క్రింది ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి సరైన దానిని ఎంచుకోండి. 

1) పెండ్లికి త్రిజేష్ట పనికి రాదు అంటే 

అ ) పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు ఆమె తల్లి జేష్ఠమాసములో పుట్టినవారు కాకూడదు.  

ఆ )  పెండ్లి కుమారుడు ఆయాన తండ్రి,  పెండ్లి కుమార్తె  జేష్ఠమాసములో పుట్టినవారు కాకూడదు. 

ఇ )  పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు పౌరోషితుడు  జేష్ఠమాసములో పుట్టినవారు కాకూడదు. 

ఈ )  పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు పెండ్లి జేష్ట మాసములో  కాకూడదు. 

2)     రావణ బ్రహ్మ కనుగొన్న రాగము పేరు ఏమిటి. 

అ )  శ్రీ రాగము

ఆ )   ఆది తాళము

ఇ )    ఖరహర ప్రియరాగము

ఈ ) కాపీ రాగము 

3)  తింటే గారెలే తినాలి వింటే_____

అ )  రామాయణం వినాలి

ఆ )   మనుచరిత్ర వినాలి

ఇ )    భారతం వినాలి

ఈ ) భాగవతం వినాలి 

4)  మనిషి శరీరంలో కిడ్నీలు ఎన్ని ఉంటాయి

అ )  ఒకటి

ఆ )   రెండు

ఇ )    మూడు

ఈ ) నాకు తెలియదు 

5) కంప్యూటర్ వైరస్ అనునది ఒక 

అ )  సూక్ష్మ క్రిమి

ఆ )   రోగకారక వైరస్

ఇ )    ఒక ప్రోగ్రాము అది కంప్యూటర్లోని సాఫ్ట్ వేరుని పాడు చేస్తుంది

ఈ ) కంప్యూటర్కు వర్షాకాలంలో వచ్చే ఒక వ్యాధి.

కామెంట్‌లు లేవు: