సమున్నతంగా నిలిచిన వెల్లాయ్ గోపురం ! వెల్ల అంటే సున్నం తెలుగులో ! తెల్లగా ఉంటుంది ! తెల్లగా ఉంటుంది కాబట్టి వెల్లాయ్ గోపురం అని పిలిచారనుకున్నారా ? కాదు !
..
రంగనాథ స్వామి గుడిలోని 20 కి పైగా ఉన్నగోపురాలు అన్ని రకరకాల రంగులలో ఉంటాయి ! ఈగోపురమొక్కటే తెల్లగా ఉంటుంది ! గత 1100 ఏళ్ళనుండీ అదే రంగు ! తెలుపు !!!
...
ఒక మహాతల్లి త్యాగానికి బలిదానానికి కృతజ్ఞతతో మనము పెట్టుకున్న పేరు !
...
ఎవరా తల్లి ఏమా కధ ?
...
కధ పెద్దది సంక్షిప్తంగా చెపుతాను !
...
సుల్తాన్ సేనలు శ్రీరంగాన్ని చుట్టుముట్టాయి ! కాఫిర్ల అంతు చూడాలనే పంతంతో వచ్చారు వాళ్ళు ! శ్రీరంగం ప్రజలు ధైర్యంగానే ఎదుర్కొన్నారు ! కానీ విధర్మీయుల పశుబలం ముందు నిలబడలేక ఓడిపోయి 12000 మంది ప్రాణాలు అర్పించారు !
...
సేనలు మూలమూర్తిని సమీపించకుండా ఒక దేవదాసి వారికి తన నృత్యంతో కనువిందు చేసింది ! సుల్తానుయొక్క సైనికకమాండరును మాయలో పడవేసి ఆ గోపురం ఎక్కించి ఒక్క ఉదుటున అక్కడినుండి తోసివేసింది ! తానూ వారి చేతికి చిక్కి చావటం ఇష్టం లేక గోపురం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది ! ఈ సమయాన్ని అక్కడి అర్చకుడు చక్కగా వినియోగించుకొని స్వామిని మధురై తరలించివేశాడు ! ఈ సంఘటన C.E 1323 లో జరిగింది !
..
సుల్తన్ సేనలు దోచిన సొమ్ము 20 బండ్లకు నిండుగా ఎక్కించి తరలించుకు పోయారు !!!
...
ఆవిడే లేకపోతే ? శ్రీరంగం కళతప్పేది ! హంపివిజయనగరం కన్నా ముందే ధ్వంసమయి ఉండేది !!!
...
ఆ మహాతల్లి పేరు "" వెల్లాయ్ ""
...
అమ్మా ! మీ వంటి వారి త్యాగాలే సనాతన ధర్మానికి ఊపిరిపోసి నిలబెడుతూ వచ్చాయి !!!
...
ఆతల్లికి సహస్రాధిక పాదాభివందనాలు !
...
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి