"కాశీలో చిత్రమయ అంగయాత్ర (శ్రీశివ అంగ యాత్ర)"
కాశీఖండంలో చెప్పబడిన మరో మహిమాన్విత యాత్ర ఇది.
⏩ 1) శిరస్సు : కృత్తివాశేశ్వరుడు (చిరునామా: కృత్తివాసేశ్వర్, హరతీర్థ్, వృద్ధ కాల్ వద్ద. [కాలభైరవుని గుడి దగ్గర్లోనే కృత్తివాసేశ్వరుడు, మృత్యుంజయ మహాదేవుడు, రత్నేశ్వర మహదేవ్ మందిరం ఉంటాయి]
⏩ 2) శిఖా : ఓంకారేశ్వరుడు (చిత్తన్‌పురా, పఠాని తోలా, కోయలా బజార్ రోడ్డు, మకరేశ్వరుని మందిరం ఎదురుగా, అలంపుర)
⏩ 3) రెండు కళ్ళు : త్రిలోచనేశ్వరుడు (త్రిలోచన్ ఘాట్ దగ్గరలో, మచోదరి)
⏩ 4) రెండు చెవులు : భారభూతేశ్వరుడు (గోవిందపుర చౌక్) మరియు గోకర్ణ (కోడై కి చౌకీ, దైలు స్ట్రీట్)
⏩ 5) రెండు కుడి చేతులు : విశ్వనాథుడు మరియు అవిముక్తేశ్వరుడు (విశ్వనాథ్ ఆలయ సముదాయంలో)
⏩ 6) రెండు ఎడమ చేతులు : ధర్మేశ్వరుడు (మీర్‌ఘాట్, దశాశ్వమేధ సమీపంలో) మరియు మణికర్ణికేశ్వరుడు (మణికర్ణిక ఘాట్ దగ్గర)
⏩ 7) రెండు పాదాలు : కాళేశ్వరుడు (మృత్యుంజయ దేవాలయ సముదాయం) మరియు కపర్దీశ్వరుడు (పిశాచ మోచన కుండం లేదా విమల్ కుండం)
⏩ 8) పిరుదులు : జైశేశ్వరుడు (కాశీపుర, కాశీదేవి ఆలయం సప్త్సగర్, వారణాసి)
⏩ 9) నాభి : మధ్యమేశ్వర్ (దారా నగర్, మైదాగిన్, మధ్యమేశ్వర్ మొహల్లా)
⏩ 10) కపాలం మరియు శిరో భూషణం : ఆదిమహాదేవుడు (త్రిలోచన ఘాట్, త్రిలోచనేశ్వరుడి ఆలయం వెనుక వీధి), శ్రుతేశ్వరుడు (రత్నేశ్వరుడి ఆలయం దగ్గర, మృత్యుంజయ మందిర మార్గం)
⏩ 11) హృదయం : చంద్రేశ్వర్ (సిద్ధేశ్వరి వీధి, చౌక్)
⏩ 12) ఆత్మ : ఆత్మవీరేశ్వరుడు (సింధియా ఘాట్)
⏩ 13) లింగం : శ్రీగౌరికేదారేశ్వరుడు (కేదార ఘాట్)
⏩ 14) శుక్రభాగం : శుక్రేశ్వరుడు (కాళికా వీధీ, విశ్వనాథుని ఆలయ వీధిలో)
ఈ పవిత్ర యాత్ర చేయడం ద్వారా, ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పటికీ అతని అంగాలు (అవయవాలు) దెబ్బతినకుండా ఉంటాయి అనేది భక్తుల యొక్క నమ్మకం. ఎవరైతే ఈ యాత్రను సరైన రీతిలో చేస్తారో అతడు మోక్షాన్ని పొందుతాడు. శివ అంగ యాత్ర స్కంద పురాణంలోని కాశీఖండం నుండి గ్రహించబడింది! శివుని యొక్క అవయవాలకు సంబంధించిన లింగాలు పూర్తిగా ఒక్క కాశీలో మాత్రమే ఉన్నాయి. ఈ శివ అంగ యాత్రకు సంబంధించిన అన్ని శివలింగాలు కాశీలోనే దర్శించవచ్చును.
"ఓం నమఃశివాయ"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి