🌸<*
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 74
ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ:
ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ
బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం
జాలుఁజాలుఁగవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో
చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా!
నావంటి కవులు తమ పరిమితమగు బుద్ధి శక్తి తో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము చాలు చాలును.
సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా...
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి