29, సెప్టెంబర్ 2021, బుధవారం

యువతరం జీవితాలలో వెలుగు నింపడమే దార్శనికత

 " వృద్ధాప్యం, యావత్ విశ్వ జీవజాలానికి దివ్య ప్రకాశ చైతన్య దృక్పథ నిర్దేశితం " సృష్టి కర్త బ్రహ్మ నిర్దేశించిన జీవన వ్యవస్థలో భాగం, వృద్ధాప్యం ! సకల జీవ సృష్టిలో మానవ జన్మ, మహోన్నతం ! బాల్య వ్యవస్థ, ప్రతి వ్యక్తి జీవితానికి, మాతృప్రేమ తో సమ్మిళిత సన్మార్గ సువ్యక్తిత్వ చైతన్య స్ఫూర్తి ! సుసంస్కార, సుహృద్భావ దృక్పథ జీవన పథంలో సాగమని అమ్మ నేర్పే సన్మిత్ర స్ఫూర్తి ! ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం నేర్చే విశ్వ మానవాళి, తమ జీవన గమనంలో మహోన్నత శిఖరాలధిరోహిస్తోంది ! కాలక్రమంలో మనిషికి వృద్ధాప్య స్థితి రావడం సహజం, తన అనుభవమే భావి జీవనమార్గ నిర్దేశితమన్నది సత్యం ! విశ్వ మానవాళి నిత్య సత్య సహృదయ, సుహృద్భావ, సుస్నేహ భావనాత్మక జీవనం, వసుధైక కుటుంబక వ్యవస్థ నిర్మాణ దివ్య పథం ! వృద్ధాప్యం, ఈ మహత్తర జీవన విధానానికి మహోన్నత సుసంస్కార దివ్య భవ్య వేదిక అనెడి సమున్నత స్థానం ! తమ తమ జీవన గమనాల్లో అనేక ఒడిదుడుకులు తట్టుకున్న అనుభవమే వృద్ధుల జీవితాలలోని దివ్య ప్రకాశం ! " వృద్ధాప్యం ", ఏనాడూ మానవ జీవితాలలో శాపం కానేరదు, ఆ వ్యక్తుల పూర్వ జీవన అనుభవాన్ని సన్మార్గ భావి జీవన పథ నిర్దేశనంగా భావించిన నేపథ్యంలో ! వృద్ధులు, సకల విశ్వ భావి తరాలకు సక్రమ, సుసంస్కార, సన్మైత్రీ చైతన్య స్ఫూర్తినొసగే సన్మార్గంలో పయనించాల్సిన ఆవశ్యకత ప్రధానమిక్కడ ! ఏ వ్యక్తీ, తన జీవితంలో వృద్ధాప్యాన్ని భయంకరమైన రీతిలో భావించరాదనే సత్యం గ్రహించాలన్నదే ముఖ్య విషయం ! వృద్ధాప్యంలోని వారు తమ భావి తరాలకు దివ్య ప్రకాశ మహోన్నత జ్యోతిగా యువతరం జీవితాలలో వెలుగు నింపడమే దార్శనికత ! " వృద్ధాప్యం, ఏ నాడూ శాపం కాబోదు, మానవ జీవన పథంలో, వృద్ధులైన వారు తమ జీవన గమనంలో పొందిన అనుభవాన్ని రానున్న తరాల మంచి భవితకు సన్మార్గ దిశలో పంచినప్పుడు ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: