14, మే 2023, ఆదివారం

అగ్నేశ్వరాలయం - వారణాసి

 *_🙏అగ్నేశ్వరాలయం - వారణాసి🙏_*


🌸ఒకానొకప్పుడు భక్తి శ్రద్ధలతో కూడిన విశ్వనార్ అనే బ్రాహ్మణుడు తన భార్య సుచిష్మతితో కలిసి జీవించేవాడు. కొద్ది రోజులకి వారి పూజా ఫలితాల కారణంగా దైవానుగ్రహంతో ఓ మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఆ బిడ్డకి చుట్టు పక్కల ఉన్న ప్రముఖులు కలసి గ్రహపతి అని పేరు పెట్టారు.

విశ్వనార్ కుమారుడు పుట్టుక తర్వాత, బిడ్డ పుట్టుక, పెంచేటప్పుడు జరపవలసిన అన్నీ ఆచార పద్ధతులను క్రమ తప్పకుండా నిర్వహించాడు. గ్రహపతికి అతిధి ఐదో ఏటా బ్రహ్మోపదేశం చేసి, ఉపనయనము చేయడం జరిగింది. అతడు అన్నీ వేద విద్యలను తన తండ్రీ, మరియు గురువైన విశ్వనార్ వద్దనే నేర్చుకున్నాడు.


🌸ఒకరోజు నారద మహర్షుల వారు విశ్వనార్ ఇంటికి వెళ్లి, వారి ఆథిత్యాన్ని స్వీకరించి, వారు అందించిన ఆథిత్యానికి ఉప్పొంగి, నారద మహర్షి గ్రహపతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అతడిని నిశితంగా పరిశీలించి,

గ్రహపతి తల్లిదండ్రులతో ఇలా చెప్పాడు., ఇతడి అన్నీ శరీర అవయవాలు, నడవడిక రాజ యోగాన్ని సూచిస్తున్నాయి, కాన్యూ ఇతడి పన్నెండేళ్ల వయసులో, భీతిగొలిపే ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, ఓ పిడుగుపాటు (అగ్ని) కారణంగా ప్రాణాపాయం ఉందని హెచ్చరించాడు. ఇలా చెప్పి నారదుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు.


🌸ఇది విన్న వారివురు తల్లిదండ్రులూ భయకంపితులు అయి, విశ్వనార్ స్పృహతప్పి పడిపోగా, అతని భార్య భోరున విలపించడం జరిగింది. అంతటితో గ్రహపతి అతని తల్లిదండ్రుల కష్టాలను చూసి, తాను కాశీకి వెళ్లి మృత్యుంజయ రూపంలో ఉన్న శివుడిని పూజించడం ప్రారంభిస్తానని చెప్పాడు.

కాశీకి వచ్చి మణికర్ణికా తీర్థంలో స్నానం చేసి విశ్వేశ్వరుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు.,


🌸గ్రహపతి అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్టించి, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు.

ఈ లింగంపై రోజూ 108 కుండల గంగాజలంతో అభిషేకం చేస్తూ పూలు, ఇతర పదార్థాలతో వివిధ పూజలు, అర్చనలు చేశారు. ఇలా తీవ్ర తప్పస్సు చేస్తూ, నెలల కొద్దీ ఉపవాసం వుంటూ., దాదాపు రెండు సంవత్సరాలు గడిపాడు.


🌸అప్పటికే అతనికి పన్నేడేండ్లు వచ్చాయి. అతనికి నారదుడు చెప్పిన ఆ ప్రమాద ఘడియాలు సమీపించాయి. దేవతల రాజు, ఇంద్రుడు గ్రహపతి ముందు ప్రత్యక్షమై అతనికి దివ్యమైన వరాన్ని అందిస్తూ.. ఏమి కావాలో కోరుకోమన్నాడు.

గ్రహపతి గౌరవపూర్వకంగా తాను శివుడిని ఆరాధిస్తున్నానని కాబట్టి ఆయనే ఆశీర్వచనలానైనా, వరాలైనా ఇవ్వగలడని మరెవ్వరూ తనకు ఇవ్వలేరని అంటాడు.


🌸అతడిని ఆశీర్వదించే ఏకైక దేవుడు తానేనని ఇంద్రుడు పలికాడు. గ్రహపతి మళ్ళీ ముందు చెప్పిన మాటలనే మర్యాద పూర్వకంగా పునరావృతం చేసాడు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు, తన వజ్రాయుధంతో (పిడుగు) తో గ్రహపతి దాడి చేసి గాయపరిచాడు.

ఆ ధాటికి తాలలేని గ్రహపతి, సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు మహాశివుడు అతని ముందు ప్రత్యక్షమై అతన్ని స్పృహలోకి తెచ్చాడు. గ్రహపతి గాఢనిద్ర నుండి మెలకువ వచ్చినట్లు లేచి తన ముందు ప్రత్యక్షంగా నిలబడి ఉన్న పరమశివుడిని దర్శించి ధన్యుడయ్యాడు.


🌸పరమశివుడు గ్రహపతిని పరీక్షించదలచానని, పరమేశ్వరుని రక్షణలో ఉన్న ఏ భక్తులు ఎవ్వరూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సెలవిచ్చాడు. పరమేశ్వరుడు అతనికి దైవత్వాన్ని కల్పిస్తూ వరమిచ్చాడు.

గ్రహపతి ప్రతిష్టించిన లింగం ఇక నుండి అగ్నేశ్వర లింగం అని పిలువబడుతుందని, అగ్నేశ్వర లింగాన్ని పూజించే భక్తులకు పిడుగులు లేదా అగ్ని నుంచి భయం ఉండదనీ..


🌸ఈ అగ్నేశ్వర్ లింగాన్ని పూజించే భక్తులకు అకాల మృత్యువును (అకాల మరణం) సమీపించదని, కాశీలో అగ్నీశ్వరుని పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి, ఎక్కడ మరణించినా అగ్ని లోకానికి చేరుకుంటారని మహాశివుడు చెప్పాడు. ఇలా చెప్పి ఆ మహాశివుడు గ్రహపతి ప్రతిష్టించిన ఆ అగ్నేశ్వర్ లింగంలోకి అదృశ్యమయ్యాడు.


🌹 దేవాలయం యొక్క స్థానం 🌹


🪷ఈ ఆలయం హౌస్ నెం. Ck.2/1, పటాని తోలా, భోసాలా ఘాట్, వారణాసి వద్ద ఉంది. సైకిల్ రిక్షా ద్వారా చౌక్ వరకు ప్రయాణించి, సంకట దేవి ఆలయం (ప్రసిద్ధ మైలురాయి) గుండా ఈ ప్రదేశానికి నడవవచ్చు.


🌸ప్రత్యామ్నాయంగా, భక్తులు మెహతా హాస్పిటల్ సమీపంలోని భోసలే ఘాట్/గణేష్ ఘాట్ వరకు పడవ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు మరియు మెట్లు ఎక్కవచ్చు.


🌹 పూజల రకాలు 🌹


🪷ఆలయం ఉదయం 07.00 నుండి 9.00 గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం 06.00 నుండి 10 గంటల వరకు శివరాత్రి మరియు కొన్ని ఏకాదశి రోజుల వంటి ముఖ్యమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


🌸భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి పూజలు చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: