25, ఆగస్టు 2020, మంగళవారం

మనుచేరిత్ర

హిమాలయాల నుంచి ఇంటికి దారియ వెతుక్కుంటూ బయలుదేరిన ప్రవరుడి కి
 అడ్డంగా నిలబడింది అప్సర. తన ఇంటికి దారి చెప్పమని కోరాడు
మన ప్రవరుడు. అప్పుడు...

ఆమె నవ్వి"కన్నులుండగా దారి ఎందుకు తెలియదు? అందులో ఇంత పెద్ద కనులాయె ! ఓ అయ్యా! మేము అప్సరసలము. నాపేరు *వరూధిని*  మేమెప్పుడూ
 ఈ కొండలలో విహరించు
చుందుము.
నీవుమాకు అతిథి వైతివి.
మా ఆతిథ్యం స్వీకరించుము. అయ్యో! ఎండలో నవిసి పోయినావు. మా ఇల్లు పావనము చేయుము" అని ఆమె అన్నది.
అతడు
"ఓయమ్మా నేను తొందరగా
మా ఊరు పోవలెను. నీవు మాకు ఆతిథ్యం 
ఇచ్చినను ఈయక పోయిననూ  ఒకటే. మీరు దేవతాస్త్రీలు మీ వద్ద మహత్తులుండును. నన్ను మా ఊరు చేర్చిపెట్టు" అన్నాడు.
అప్పుడామె
"ఏమి ఊరయ్యా,
మీవి పూరిగుడిసెలై యుండును.
మావి రత్నాల మేడలు.
ఇక్కడ గంగ యొక్క ఇసుకతిన్నెలు,
పూపొదరిండ్లు,
అవిఅంతయు ఎందుకు గానీ,
ఒక్క మాట చెప్తున్నాను విను.
నా మనసు నీమీద మరలినది నన్ను చచ్చిపొమ్మందువా!
లేకపోయినచో
నన్ను స్వీకరింతువా?" అనగా
అతడు
"నీవు బలే దానివే మేము బ్రాహ్మణులము. ఇంటిదగ్గర అగ్నిహోత్రాలు చెడిపోవుచున్నవి.
నా తల్లిదండ్రులు ముసలివారు.
నేనుఇంటికి వెళ్ళనిచో,
వారు భోజనం చేయరు"
 అనగా ఆమె ముఖము చిన్న పోయినది. ఇది ఏమి అప్సర స్త్రీలుకోరగా
ఈ రీతిగా మాట్లాడే వాడు కూడా ఉండునా?
అనుకొని మరల ధైర్యం తెచ్చుకొని "అయ్యా! మీకు తెలియదు.
యజ్ఞాలు చేసిన వారికి మేములభింతుము. ఇక్కడ ఏమి భోగాలు!
ఎన్ని సుఖాలు!
నీవు మాటాడు మాటలకు అర్థం ఏమైనా ఉన్నదా? గుడ్డివానికి వెన్నెల అన్నట్లు ఉన్నది.
నీవు ఎన్ని జన్మలు ఎత్తినచో ఇట్టి భోగము కుదురును".
ఈ రీతిగా వారికి కొంతసేపు ప్రసంగం అయిన తరువాత ఆమె
ఇదియే బ్రహ్మానందము అన్నది.
దానికి అతడు కొంచెం తడబాటు పడ్డాడు. ఇది ఏమి పాండిత్యం అన్నాడు.
ఏదోతన అగ్నిహోత్రము, ధర్మముల గురించి ఉపన్యాసం మొదలు పెట్టినాడు.
ఆమెకు ఒళ్ళు మండిపోయింది "!
ఆడది తనంతట తాను వలచిరాగా ఎంత తేలిక? "
అని
ఇతనితో
ఇట్లు కాదనుకొని హఠాత్తుగా పోయి కౌగలించుకుంది.



ఆమెను దూరంగా
త్రోసివేసినాడు.
ఆమెకు  చాలా  కోపం వచ్చెను.
కానీ కోరిక మాత్రం ఏమి తగ్గలేదు.
ఓయి నిర్దయుడా! చూడు నీ గోరు ఇచ్చట గుచ్చుకున్నది అని వలవల ఏడ్చినది.
యజ్ఞములెందుకు? నీ తపస్సెందుకు?
నీ పుణ్యములెందుకు? నీకు భూతదయ లేదు.
నీది వట్టిరాతి గుండె.
పరాశరుడు విశ్వామిత్రుడు  వారి కంటే గొప్ప వాడు ఏమి అని ఆమె అనుకు న్నది. ఇతడు ఆమె కౌగిలించుకున్న అప్పుడు అంటిన జవ్వాది గంగలో కడిగేసుకుని తాను  ఇట్లనెను. "నేను నిత్యాగ్నిహోత్రుడనేనినేను
ఇతరుల భార్యలను, ఇతరుల ధనమును కోరని వాడనేని అగ్నిహోత్రుడా!
నన్ను  ప్రొద్దుగ్రుంకెడు లోపల మా ఇంటికి చేర్చు"
 అని ప్రార్ధించెను.
ఆ అగ్నిహోత్రుడు అతనిని ఇంటికి చేర్చెను. ....
 
 ఇంకా ఉంది 
డాక్టర్ నిభాపూడి సు
****************

కామెంట్‌లు లేవు: