17, మే 2024, శుక్రవారం

భజగోవిందం 23*

 *భజగోవిందం 23*

*తెలుగు పద్యానువాదము*

*రచన: పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


*తే గీ. నీ వెవరివి తెలియలేదు నేనెవరిని*

*తెలియలేదు నెక్కడ నుండి దిగి వచ్చె*

*బంధమెట్లు కలిపినదో పరిచయాలు*

*తల్లి యెప్వరో నాకెట్లు తండ్రి యగును*

*చింత చేయుము నీవింక చివరి వరకు*

*సారమేమియు లేనిదీ జగతి యంత*

*కలల కనిపించు దృశ్యమై కరిగిపోవు*

*విడిచిపెట్టును నిను వీడి వెళ్ళిపోవు*

కామెంట్‌లు లేవు: