జయగురుదత్త !
"యజ్ఞోహి శ్రేష్థతమం కర్మ" యజ్ఞం చేయడాన్ని మించిన కర్మ వేరొకటి లేదు. "ఏదమగన్మ దేవజనం .." అనే మంత్రార్ధం - పూర్వకాలములో ఎక్కడైతే యజ్ఞములు జరుగతవో మరల మరల యజ్ఞములు అక్కడే జరుగుతవి అని అర్ధం. అటువంటి పుణ్యభూమి అయిన జగద్గురువులు కంచి పీఠాధీశులు, శృంగేరీ పీఠాధీశులు, దత్తావధూత శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే ప్రతిష్ఠితమైన శ్రీ యజ్ఞదత్త క్షేత్రము , జుజ్జూరు నందు, మా నాన్నగారు, కర్మజ్యేష్ఠులు బ్రహ్మశ్రీ మద్దూరి వేంకటేశ్వర యాజులు గారిచే అనేక పర్యాయములు అనుష్థింపబడిన "నాచికేత యుక్త జ్యోతిరతిరాత్రము" అను మహాయజ్ఞమును క్రోధి నామ సంవత్సర ఆషాఢ శుధ్ధ చవితి (10-07-2024) మొదలు నవమి (15-07-2024) వరకు జరుప దైవజ్ఞ ప్రేరణ అయినది, ఇది విశేషమైన క్రతువు, అపురూపమైనది, అత్యంత ఫలదాయకము, కావున ఈ క్రతువులో పాల్గొని మీ యధాశక్తి సేవ జేసుకొని ఆ యజ్ఞపరమాత్ముని అనుగ్రహము పొందవలసినది. మరల మరల ఇటువంటి క్రతువులో పాల్గొనే అవకాశం దుర్లభమే.
ఇందుతొ పత్రికను జతపరచుచున్నాను.
భవదీయుడు
మద్దూరి యజ్ఞనారాయణ షోడశి అత్యగ్నిష్టోమ సనాచికేత కాఠకోక్థి ఆప్త వాజపేయ బృహస్పతిసవ యజ్వ
9849007481
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి