రాత్రి "పాడుతాతియ్యగా" ఫైనల్స్ చూస్తే చాలా సంతోషం కలిగింది..
ఆయా పిల్లల నిరంతర కృషి, పట్టుదల అమోఘం..
వారి విజయాల వెనుక వారి తల్లిదండ్రుల ప్రోత్సాహసహకారాలు ఎన్నదగినవి..
అవకాశాలనివ్వాలేగానీ పిల్లల ప్రతిభల్లో ఏలోటూ ఉండదు..
పాఠశాలనుండి వచ్చిన చిన్నారులు తమ అనుభవాలను బోలెడు చెప్పి తమ ఆనందాలను పంచుకోవాలని ఆశగా తమయింటిలోని తమతల్లిదండ్రులవద్దకో లేక పెద్దలదగ్గరికో వస్తారు..
వాళ్లను చేరదీయడం మాటెలా ఉన్నా తమతమ వ్యాపకాలకు (సీరియల్స్, టీవీసినిమాలు, ఫోన్లు) భంగం కలుగుతోందని విసుగ్గా వాళ్లను పట్టించుకోకుండా ఉంటే వాళ్లకు దిక్కేది?
ఎలా ఎదుగుతారు వాళ్లు?
మనింటికి అతిథులెవరైనా వస్తే వాళ్లకు ఎనలేని మర్యాదలు చేసేసి తెగ కబుర్లు చెప్పేసి వాళ్లు వెళ్లగానే వాళ్లగురించి దారుణంగా మాట్లాడడం విన్న పిల్లలకు విశాలభావాలెలా అలవడతాయి?
మనకున్న సమయంలో కొంతసేపైనా వాళ్లను చేరదీసి వారిప్రతిభలను అభినందిస్తూ మన అనుభవంలోనున్న విజయగాధలను చెబితే వారికి నాయకత్వ లక్షణాలు అబ్బవా?
ఎంతసేపూ ఇతరులతో పోల్చడం, వారి ఎదుటనే కీచులాడుకోవడంవంటివి చేస్తే వారిలో అభద్రతాభావం పెరగదంటారా?
లోగడ క్విజ్ కార్యక్రమాలూ, ప్రపంచంలోని అద్భుతాలూ ప్రసారమయ్యేవి.
ఇప్పుడన్నీ యూట్యూబ్ లలో అందుబాటులో ఉంటున్నాయి.
వాటిని చూడాలని వీళ్లకు తెలిస్తేకదా!
ఎంతసేపూ నీచపదాలతో దరిద్రపు హాస్యంతో కూడినవే చూడడానికి ఇష్టపడుతున్నారు..
సరైన మార్గదర్శనం కొరవడుతోందనిపిస్తోంది..
పెద్దలు కొన్ని త్యాగాలు చేయగలిగితేనే పిల్లల్లోని ప్రతిభ బైటికొస్తుందని భావన..
సానుకూలంగా తీసుకోండిసుమా!
మనలో వ్యతిరేకధోరణి పోనంతకాలం పిల్లల్లో సానుకూలదృక్పథం ఏర్పడదు..
-కాశ్యపస..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి