24, మే 2022, మంగళవారం

సంచి

 సంచి 

మనం ఏదైనా ఒక పెద్ద బట్టల దుకాణానికి వెళ్లి వస్త్రాలను ఖరీదు చేస్తే వాళ్ళు మనకు రకరకాల విధాలలో, రంగులలో, వుండే సంచులలో మన వస్త్రాలను కట్టి ఇస్తుంటారు.  ఒక్కొక్క సంచి ఒక్కొక్క రకంగా ఆకర్షణీయంగా ఉంటుంది.  కానీ వాటిని చూడగానే మనకు కొన్ని నాతఁన్యమైనవిగా కొన్ని చావకవిగా తెలుస్తాయి.  ఆలా ఎందుకు చేస్తారో తెలుసుకుందామని నను ఒకపర్యాయం వస్త్రాలు ఖరీదు చేసిన తరువాత అక్కడి విక్రయబాలిక (sales Girl ) ను అడగ ప్రయత్నించాను కానీ నేను అడగకుండానే నాకు సమాధానం లభించింది ఎలా అంటే అప్పుడే ఒక చీర కొనుక్కొని పోయిన ఒక స్త్రీ సదరు విక్రయ బాలిక వద్దకు వచ్చి నాకు నీవు నా చీర కట్టించిన (pack )కవరు బాగాలేదు అదిగో అలంటి సంచిలో పెట్టి ఇవ్వమని ఇంకొక ఆమె చేతిలో వున్న సంచిని చూపించి  కోరింది.  దానికి ఆ విక్రయ బాలిక చిరునవ్వు నవ్వి అమ్మ ఆ అమ్మ కొన్న చీర ధర ఐదు వేలు నీవు కొన్న చీర ధర కేవలం ఐదు వందలు కాబట్టి నీకు ఈ సంచి ఆమెకు ఆ సంచి  ఇచ్చాము. ఆలా ఖరీదుని బట్టి సంచులను ఇవ్వాలని మా యజమాని మాకు సూచించారు అని అసలు రహస్యం చెప్పింది.  దానికి ఆమె ఖిన్నురాలై పోయింది. అప్పుడు నాకు కూడా వివరంగా అర్థమైనది ఏమిటంటే యెంత ఖరీదు వస్తువుకుఅంత ఖరీదు సంచి అన్నమాట.  ఇదొక వ్యాపార కిటుకు.  కొంతమంది ఖరీదైన సంచిలకోసం కూడా ఖరీదైన వస్త్రాలు కొనుక్కోవచ్చు. 

అర్హత బట్టి సంచి :

పైన తెలిపిన దానిని బట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే కొనుగోలు దారుని అర్హతను బట్టి దుకాణదారుడు సంచులను ఇస్తున్నాడు.  భగవంతుడు కూడా ఎవరి అర్హతను బట్టి వారి వారి శరీరాలను (సంచులను) ఇస్తున్నాడు. అది ఎలానో చూద్దాం. 

ఈ భూమి మీద ప్రాతి జీవి రెండు రకాల కర్మలను చేస్తుంటారు. ఒకటి పుణ్యకర్మ రెండు పాప కర్మ అంటే పుణ్య కర్మ చేస్తే పుణ్యం, పాప కర్మ చేస్తే పాపం వస్తుందని మనందరికీ  తెలిసిందే. దీనిని మీకు ఇంకా సరళంగా అర్ధం కావటానికి ఒక ఉదాహరణతో చెపుతాను.  నీవు ఒక బ్యాంకులో ఖాతా తెరిచావు రోజు కొంత ద్రవ్యాన్ని జమ చేస్తున్నావు.  అది పుణ్యం అనుకో అదేవిధంగా బ్యాంకునుండి నీవు ఋణం తీసుకున్నావు అనుకో అది పాపముగా మనం పరిగనిద్దాం.  నీకు ఒక లక్ష రూపాయల జామా వున్నదనుకో ఋణం యాబై వేలు ఉందనుకో అప్పుడు నీకు బ్యాంకు నీ జమానుంచి రుణాన్ని తీసి మిగిలిన ద్రవ్యాన్ని ఇవ్వటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కానీ అందుకు భిన్నంగా అంటే నీ జమ యాబై వేలు ఋణం లక్ష రూపాయలు ఉంటే బ్యాంకు నీకు ఒక్క రూపాయకుడా ఇవ్వదు పైపెచ్చు మిగిలిన యాబై వేలు నీ నుంచి వసూలు చేయటానికి వత్తిడి తెస్తుంది. సరిగా ఇలానే భగవంతుడు కూడా మనతో ప్రవర్తిస్తాడు.  మనం రోజు చూస్తూవుంటాము కొందరు అందంగా, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటే కొందరు, అనాకారులుగా, దరిద్రులుగా వుంటూ వుంటారు.  దీనికి కారణం ఏమిటి అని విచారిస్తే మనకు పైన బట్టల దుకాణదారుని నియమే గోచరిస్తుంది. అదెలా అంటే నీవు ఒక జన్మలో చేసుకున్న పుణ్య పాపాల ఫలితాన్ని ప్రారబ్ధం అంటారు అంటే పాపపుణ్యాల సముదాయ పఠిక (BALANCE SHEET) దానిలో పుణ్యం శాతం మరీ ఎక్కువగా ఉంటే వారు ఉన్నత కుటుంబంలో చక్కటి అందచందాలతో పుడతారు. అదే మాదిరిగా వారి వారి ప్రారబ్ధ ఫలితాన్ని పట్టి వారి వారి జన్మ వస్తుంది. ప్రారబ్దములో పుణ్యం కొంచమే ఉంటే సాధారణ మానవుడుగా, పేదవానిగా, కురూపిగా, అంగవైకల్యునిగా ఆలా ఆలా వారి స్థాయికి తగినట్టు(సంచి) జన్మ లభిస్తుంది మరల ఈ జన్మలో తానూ చేసుకునే పాప పుణ్యాలు ఈ జన్మ ముగిసిన తరువాత (మరణాంతము) మరల వచ్చే జన్మకు ప్రారబ్ద రూపంలో బదలాయించ బడతాయి అన్నమాట. 

కాబట్టి మిత్రులారా మనకు ఎంతో కొంత మంచి ప్రారబ్ధం ఉండబట్టే మనం ఈ మానవ జన్మ పొంది వున్నాము.  .  సదా పుణ్యకార్యాలు చేస్తూ, దైవచింతన చేస్తూ జ్ఞ్యానాన్వేషణ చేస్తూ  ఈ జన్మను సార్ధకం చేసుకుందాము నిజానికి మోక్షానికి (జన్మరాహిత్యాన్ని) ప్రయత్నం చేసే అవకాశము మానవులమైన మనకే వుంది కాబట్టి కాలయాపన చేయకుండా ఇప్పుడే మోక్షాన్వేషణకు పూనుకుందాము.,  ప్రయత్నం ప్రారంభిస్తే తప్పకుండ ఫలితం లభిస్తుంది.  ఈ జన్మలోనే మోక్షం వస్తే మరీ సంతోషం కాకపోయినా ముందు జన్మలలో లభించిన సంతోషమే కదా మనకు వచ్చే జన్మ మరల మానవ జన్మ రావాలంటే మనం చాలా జాగ్రత్తగా కర్మలను చేయవలసి ఉంటుంది.  ఎట్టి పరిస్థితిలోను క్రిందికి పడకుండా అంటే పశుపక్షాది నీచ యోనులలో పుట్టకుండా జాగ్రత పడాలిసిన అవసరము ఎంతయినా వుంది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

 

కామెంట్‌లు లేవు: