21, జూన్ 2024, శుక్రవారం

జూన్21 పొడవైన రోజు:

 ఉత్తరాయణంలో జూన్21 పొడవైన రోజు: 


జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలనిర్ణయంలో పరిశోధనకు ఈరోజు అత్యంత ప్రధానమైనది.

ఈ రోజున (జూన్21)ఉత్తరాయణంలో   సాయన అయనాంతం జరుగుతుంది. 

అనగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏటా జూన్ 20 మరియు 22 మధ్య  భూమిపై  అయనాంతం సంభవిస్తుంది. ఉత్తర అర్ధగోళంలో , జూన్ అయనాంతం వేసవి కాలం (అత్యంత పగటికాలం ఉన్న పొడవైన రోజు), 

జూన్ 21నాడు 02:21 నిమిషాలకు సూర్యుని వైపు భూమి యొక్క గరిష్ట అక్ష వంపు 23.44°.  అదేవిధంగా, ఖగోళ భూమధ్యరేఖ నుండి సూర్యుని డెక్లినేషన్ 23.44°. ఉంటుంది. 

ఈరోజు మిట్ట మధ్యాహ్నం శంకు యొక్క ఛాయ 23.44° గా ఉంటుంది. దీని ద్వారా

భారతదేశంలో పగటికాలం నిడివి13:58 నిమిషాలు ఉంటుంది. దీనినే సాయన ఉత్తర అయనాంతం అని కూడా అంటారు.

కామెంట్‌లు లేవు: